Home /News /jobs /

SBI PO 2021: ఎస్‌బీఐ పీఓ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ అడ్మిట్ కార్డ్‌లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్.. ప‌రీక్షా విధానం వివ‌రాలు

SBI PO 2021: ఎస్‌బీఐ పీఓ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ అడ్మిట్ కార్డ్‌లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్.. ప‌రీక్షా విధానం వివ‌రాలు

ఎస్‌బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2021

ఎస్‌బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2021

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) రిక్రూట్‌మెంట్ 2021కు సంబంధించిన ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అడ్మిట్ కార్డ్‌లు విడుద‌ల అయ్యాయి. ఈ అడ్మిట్ కార్డులు (Admit Card) అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇంకా చదవండి ...
    స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) రిక్రూట్‌మెంట్ 2021కు సంబంధించిన ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అడ్మిట్ కార్డ్‌లు విడుద‌ల అయ్యాయి. ఈ అడ్మిట్ కార్డులు (Admit Card) అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.  ద‌ర‌ఖాస్తులో SBI PO ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మెటీరియల్‌ (Training Material)ని ఎంచుకున్న SC, ST లేదా మతపరమైన మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థుల‌కు బ్యాంక్ ట్రైనింగ్ (Bank Training) ఇస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number), పుట్టిన తేదీ ద్వారా ఈ అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ (Download) చేసుకోవ‌చ్చు. SC, ST మరియు మైనారిటీ అభ్యర్థులకు మాత్రమే బ్యాంక్ ఈ పరీక్షకు ముందు శిక్షణను అందించిందని గమనించాలి.

    SBI PO ప్రీ-ఎగ్జామ్ శిక్షణ  నవంబర్ రెండో  వారంలో నిర్వ‌హిస్తారు. అయితే, ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. SBI PO ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ హాల్ టికెట్ 2021ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చో తెలుసుకోండి.

    FCI Recruitment 2021: ఎఫ్‌సీఐలో ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 380 ఉద్యోగాలు.. దర‌ఖాస్తు విధానం


    అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకొనే విధానం..

    Step 1 : ద‌ర‌ఖాస్తులో ప్రి ఎక్జామినేష‌న్ ట్రైనింగ్ ఆప్ష‌న్ ఎంచుకొన్న వారు ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/careers ను సందర్శించాలి.

    Step 2: వెబ్‌సైట్‌లో కుడివైపు పైన latest announcement ట్యాబ్‌లోకి వెళ్లాలి. అందులో SBI PO రిక్రూట్‌మెంట్ 2021-22 ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ మెటీరియల్స్ లింక్‌పై క్లిక్ చేయాలి.

    IIT Madras : ఐఐటీలో 8 నెల‌ల డేటా సైన్స్ కోర్స్‌.. అప్లికేష‌న్ విధానం


    Step 3: అనంత‌రం కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మరియు భద్రతా కోడ్/టెక్స్ట్ ధ్రువీక‌ర‌ణ కోడ్‌ను న‌మోదు చేయాలి.

    Step 4: లాగిన్ వివరాలను సమర్పించిన తర్వాత, SBI PO ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ అడ్మిట్ కార్డ్ తెరవబడుతుంది

    Step 5: ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసి, దాని కాపీని సేవ్ (Save) చేయండి

    Note : అభ్య‌ర్థుల‌కు బ్యాంక్ ఫిజికల్ క్లాసులు (Physical Classes) లేదా ఆన్‌లైన్ ద్వారా PETని నిర్వహించవచ్చు.

    SBI PO ప్రిలిమ్స్ పరీక్ష 2021: పరీక్ష విధానం
    SBI PO ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడే అబ్జెక్టివ్ పరీక్ష (Objective Exam). పరీక్ష‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ (Reasoning Ebility) అనే మూడు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి పరీక్ష రాయడానికి 20 నిమిషాల వ్యవధి ఇస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ (Mains) పరీక్షకు హాజరుకావలసి ఉంటుంది, ఆపై ఇంటర్వ్యూ (Interview)కు హాజరు కావాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Exams, Job notification, JOBS, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు