హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI PO recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

SBI PO recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

SBI PO recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

SBI PO recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

SBI PO recruitment 2020 | భారీగా ఉద్యోగాల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో 2000 ప్రొబెషనరీ ఆఫీరస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

    బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అతిపెద్ద శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. మొత్తం 2000 ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్‌కి కేటాయించింది ఎస్‌బీఐ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 31, జనవరి 2, 4, 5 తేదీల్లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.

    SBI PO recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 2000

    ఎస్సీ- 300

    ఎస్టీ- 150

    ఓబీసీ- 540

    ఎకనమికల్లీ వీకర్ సెక్షన్- 200

    జనరల్- 810

    Jobs: విశాఖపట్నంలోని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    DRDO: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... రూ.31,000 వేతనంతో డీఆర్‌డీఓలో ఉద్యోగాలు

    SBI PO recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 నవంబర్ 14

    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2020 డిసెంబర్ 4

    దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2020 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4

    ప్రిలిమినరీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2020 డిసెంబర్ మూడోవారం

    ఫేజ్ 1 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5

    ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2021 జనవరి మూడో వారం

    మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి మూడో వారం

    ఫేజ్ 2 ఆన్‌లైన్ మెయిన్ ఎఘ్జామ్- 2021 జనవరి 29

    మెయిన్ ఫలితాల విడుదల- 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం

    ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం

    ఫేజ్ 3 ఇంటర్వ్యూ లేదా గ్రూప్ ఎక్సర్‌సైజెస్- 2021 ఫిబ్రవరి లేదా మార్చి

    తుది ఫలితాల విడుదల- 2021 మార్చి చివరి వారం

    ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీ అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2020 డిసెంబర్ రెండోవారం

    ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2020 డిసెంబర్ మూడోవారం లేదా నాలుగో వారం

    Aarogyasri Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీలో 648 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    Bank Jobs 2020: మొత్తం 647 బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

    SBI PO recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి.

    వయస్సు- 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

    పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Banking, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Sbi, State bank of india

    ఉత్తమ కథలు