డిగ్రీ పాసయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI డిగ్రీ అర్హతతో మొత్తం 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నోటిఫికేషన్ వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి. డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్బీఐ. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 4 వరకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వివరించింది ఎస్బీఐ. మూడు అంచెల పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.
SBI PO recruitment 2020: ఎస్బీఐలో 2000 జాబ్స్... అప్లై చేయండి ఇలా
Private Jobs: ఓ ప్రైవేట్ సంస్థలో 150 ఖాళీలు... APSSDC జాబ్ నోటీస్
ఫేజ్ 1 లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టీవ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు 30 ప్రశ్నలు ఉంటాయి. సమయం 20 నిమిషాలు మాత్రమే. ఇక రెండో సెక్షన్లో క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్కు 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. ఇక మూడో సెక్షన్లో రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. 100 ప్రశ్నలకు 60 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ప్రిలిమినరీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి మెయిన్స్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎలాంటి కటాఫ్ మార్కులు ఉండవు. ఖాళీల సంఖ్య కన్నా 10 రెట్లు ఎక్కువగా అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. అంటే 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి 20,000 మంది అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్‌కు పిలిచే అవకాశం ఉంది.
SBI PO recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్బీఐలో 2000 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Coast Guard Jobs 2020: టెన్త్ పాసైనవారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు
మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టీవ్, డిస్క్రిప్టీవ్ పద్ధతిలో ఉంటుంది. ఆబ్జెక్టీవ్కు 200 మార్కులు, డిస్క్రిప్టీవ్కు 200 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టీవ్ టెస్ట్ పూర్తి కాగానే డిస్క్రిప్టీవ్ పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టీవ్ అంటే అభ్యర్థులు తమ సమాధానాలను కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టీవ్ టెస్ట్ మూడు గంటలు ఉంటుంది. నాలుగు సెక్షన్లలో 200 మార్కులు ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు వేర్వేరుగా సమయం ఉంటుంది. మొదటి సెక్షన్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కు సంబంధించిన 45 ప్రశ్నలు ఉంటాయి. సమయం 60 నిమిషాలు ఉంటుంది. మార్కులు 60. ఇక రెండో సెక్షన్లో డేటా అనలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించిన 35 ప్రశ్నలు ఉంటాయి. సమయం 45 నిమిషాలు ఉంటుంది. మార్కులు 60. మూడో సెక్షన్లో జనరల్, ఎకనమీ, బ్యాంకింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 40 ప్రశ్నలకు 40 మార్కులు. సమయం 35 నిమిషాలు. నాలుగో సెక్షన్లో ఇంగ్లీష్‌కు సంబంధించి 35 ప్రశ్నలు ఉంటాయి. సమయం 40 నిమిషాలు. మార్కులు 40. ఇక 30 నిమిషాలు డిస్క్రిప్టీవ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్‌కు సంబంధించి రెండు ప్రశ్నలు ఉంటాయి. మార్కులు 50. ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో తప్పు సమాధానాలకు పెనాల్టీ ఉంటుంది. ప్రతీ నాలుగు తప్పులకు ఒక మార్కు తగ్గిస్తారు.
ఇక మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఫేజ్ 3 కి పిలుస్తారు. ఇందులో కూడా కటాఫ్ ఉండదు. పోస్టుల కన్నా మూడు రెట్లు ఎక్కువగా పిలుస్తారు. అంటే ఖాళీలు 2000 ఉన్నాయి కాబట్టి ఫేజ్ 3 కి 6000 మందిని పిలిచే అవకాశం ఉంది. ఫేజ్ 3 లో ఇంటర్వ్యూ (50 మార్కులు) లేదా ఇంటర్వ్యూ (30 మార్కులు), గ్రూప్ ఎక్సర్సైజ్ (20 మార్కులు) ఉంటాయి. మినిమమ్ క్వాలిఫయింగ్ మార్కులు సాధించినవారు ఫైనల్ సెలక్షన్‌కు అర్హత సాధిస్తారు. ఫేజ్ 2, ఫేజ్ 3 లో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.