హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI PO recruitment 2020: ఎస్‌బీఐలో 2000 జాబ్స్... అప్లై చేయండి ఇలా

SBI PO recruitment 2020: ఎస్‌బీఐలో 2000 జాబ్స్... అప్లై చేయండి ఇలా

SBI PO recruitment 2020: ఎస్‌బీఐలో 2000 జాబ్స్... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI PO recruitment 2020: ఎస్‌బీఐలో 2000 జాబ్స్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI PO recruitment 2020 | ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. 2000 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 2000 పోస్టులో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. డిగ్రీ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2020 డిసెంబర్ 4 లోగా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు అప్లై చేసే ముందు ఇవే వెబ్‌సైట్స్‌లో విద్యార్హతలు తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు పనిచేస్తున్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ సిద్ధం చేసుకోవాలి. ఇవే మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయి. ఇక దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు పేమెంట్ చేయొచ్చు. మరి దరఖాస్తు చేయడానికి ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

  Bank Jobs 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 647 జాబ్స్‌కి అప్లై చేయండి ఇలా

  NBCC Recruitment 2020: బీటెక్ పాసైనవారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో 100 ఉద్యోగాలు

  అభ్యర్థులు https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Latest Announcments పైన క్లిక్ చేయాలి. అందులో ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

  Apply Online బటన్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

  మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

  మీ లేటెస్ట్ ఫోటో, సంతకం నోటిఫికేషన్‌లో సూచించిన సైజ్‌లో అప్‌లోడ్ చేయాలి.

  వివరాలన్నీ ఓసారి చెక్ చేసిన తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

  చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

  దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

  Coast Guard Jobs 2020: టెన్త్ పాసైనవారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

  Aarogyasri Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీలో 648 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

  ఫీజు చెల్లింపు, దరఖాస్తు ఫామ్ సబ్మిట్, అడ్మిట్ కార్డులకు సంబంధించి ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 022-22820427 నెంబర్‌కు వర్కింగ్ డేస్ రోజున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. లేదా ఐబీపీఎస్ క్యాండిడేట్ గ్రీవియెన్స్ రిడ్రసల్ సిస్టమ్‌ పోర్టల్ https://cgrs.ibps.in/ లో కంప్లైంట్ చేయొచ్చు. ఇమెయిల్ సబ్జెక్ట్‌లో 'RECRUITMENT OF PROBATIONARY OFFICERS IN STATE BANK OF INDIA - 2020' అని టైప్ చేయడం తప్పనిసరి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Sbi, State bank of india

  ఉత్తమ కథలు