Home /News /jobs /

SBI OFFERS FREE ONLINE LEARNING COURSE FOR UNDERPRIVILEGED STUDENTS IN MATH LANGUAGE HERE DETAILS NS GH

Online Learning Course: విద్యార్థులకు SBI శుభవార్త.. మ్యాథ్స్, ల్యాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్‌లో ఫ్రీగా ఆన్‌లైన్ కోర్స్‌.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఖాన్ అకాడమీ భాగస్వామ్యంతో ఎస్‌బీఐ ఫౌండేషన్ పేద విద్యార్థుల కోసం అప్‌స్కూల్ అనే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌(Digital Learning Programme)ను పరిచయం చేసింది.

ఖాన్ అకాడమీ భాగస్వామ్యంతో ఎస్‌బీఐ ఫౌండేషన్(SBI Foundation) 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం అప్‌స్కూల్ అనే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ (Digital Learning Programme)ను పరిచయం చేసింది. ఇది అభ్యాస అంతరాలను తగ్గించడం, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మ్యాథమెటిక్స్‌, ల్యాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్‌ నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు learn.khanacademy.org/upschoolలో ప్రోగ్రామ్ కోసం ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. 4- 6 వారాల పాటు వాట్సాప్‌లో లెర్నింగ్ లింక్‌లను పొందవచ్చు.

ఈ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ గురించి స్టేట్ బ్యాంక్ గ్రూప్ చైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ.. ‘మేము వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల్లో సమానత్వాన్ని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌తో లక్ష్యం సులువుగా నెరవేరుతుంది’ అన్నారు. ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత ప్రతి విద్యార్థికి డిజిటల్ సర్టిఫికేట్ అందజేస్తారు. ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషలలో అందుబాటులో ఉన్న వనరులు తల్లిదండ్రులు, విద్యార్థులకు 100 శాతం ఉచితం.

అభ్యర్థులు ఇంటి నుంచి వీలున్న సమయంలో నేర్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్‌, ల్యాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్‌లో మునుపటి సంవత్సరం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను తిరిగి గుర్తుచేసుకొని నేర్చుకునేలా ప్రోగ్రామ్ దృష్టి సారిస్తుంది. అభ్యాస అంతరాలు లేకుండా, కొత్త తరగతికి బలమైన పునాదులు పడేలా సహాయపడుతుందని ఎస్‌బీఐ ఫౌండేషన్‌ స్పష్టం చేసింది.

అదనంగా డ్యాన్స్, యోగా వంటి వినోదాత్మక అభ్యాస కార్యకలాపాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు లింక్‌లను సందర్శించడం ద్వారా పాల్గొనవచ్చు. ప్రతి వారం విద్యార్థులు వారి గ్రేడ్, సెలక్ట్‌ చేసుకున్న ల్యాంగ్వేజ్‌ ఆధారంగా మ్యాథ్స్‌ లెసన్‌, ఒక చిన్న కథ, వినోదభరితమైన కార్యాచరణ లేదా ఎక్సెర్‌సైజ్‌కు సంబంధించిన లింక్‌ పొందుతారు.

SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ MD, CEO వినయ్ M టోన్సే మాట్లాడుతూ..‘బ్యాక్-టు-స్కూల్ సీజన్ ప్రారంభంలో, మా అప్‌స్కూల్ ఫౌండేషన్స్ ప్రోగ్రామ్ విద్యార్థులు సిద్ధంగా ఉండటానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ని విద్యార్థులందరికీ అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. నిపుణులు అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన, ఇంటరాక్టివ్ టూల్స్‌తో విద్యార్థులను సన్నద్ధం చేయడం, నాణ్యమైన కంటెంట్‌ను వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం ప్రోగ్రామ్‌ ప్రత్యేకతలు. దీన్ని సాధించడంలో ఖాన్ అకాడమీతో కలిసి పని చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.’ అని చెప్పారు.

ఇంతకుముందు SBI ఫౌండేషన్, ఖాన్ అకాడెమీ హై క్వాలిటీ మ్యాథమెటిక్స్‌ కంటెంట్‌ను రూపొందించడంలో కలిసి పని చేశాయి. అందరు విద్యార్థులకు ఉపయోగపడేలా వివిధ స్థానిక భాషల్లో కంటెంట్‌ అందుబాటులో ఉంచారు. పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోని అభ్యాసకులందరినీ లక్ష్యంగా చేసుకుని పంజాబీలో రూపొందించిన వీడియోలు, కథనాలు, వివిధ ఎక్సెర్‌సైజ్‌లతో కూడిన మ్యాథమెటిక్స్‌ లెసన్స్‌ ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Online course, Sbi, State bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు