SBI Jobs : 9వేల పోస్టులకి SBI నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

Bank Jobs | ప్రస్తుతం బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎక్కువ ఉపాధి అవకాశాలున్నాయి. ఇప్పటికే నిరుద్యోగుల కోసం ఎన్నో నోటిఫికేషన్స్‌ని బ్యాంకులు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే 9 వేల జాబ్స్‌ని త్వరలోనే భర్తీ చేయనుంది SBI.

news18-telugu
Updated: April 28, 2019, 10:03 AM IST
SBI Jobs : 9వేల పోస్టులకి SBI  నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
SBI New Rules: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మే 1 నుంచి మారే రూల్స్ ఇవే...
news18-telugu
Updated: April 28, 2019, 10:03 AM IST
28ఉపాధి అవకాశాలే లక్ష్యంగా బ్యాంకింగ్ సంస్థలు రానున్న రోజుల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు అందిస్తున్న సేవలను విస్తృతపరిచే లక్ష్యంతో దాదాపు 9వేలమంది జూనియర్ అసోసియేట్లను నియమించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఇందులో అన్నీ కులాలు కలిపి 8,904 పోస్టులను భర్తీ చేయనుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ధీటుగా.. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రస్తుతం 1,047 ఓపెనింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా.. ఐడీబీఐ బ్యాంక్ దాదాపు 950 ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరింది. ఇందులో ఎక్కువగా ఎల్‌ఐసీ సంస్థ ఈ బ్యాంకుతో భాగస్వామ్యం అయ్యాకే ఇన్ని ఉద్యోగావకాశాలు పెరిగాయి.

ఎస్‌బీఐ తన పరిధిని 17 సర్కిళ్లలో విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తుంది. అందుకోసమే విస్తారంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. అయితే.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎక్కడైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించి ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.

2017-18 సంవత్సరానికి గానూ ఎస్‌బీఐ 3,211 మంది ఉద్యోగులకి అవకాశం కల్పించింది. పదవీవిరమణ, ఇతర కారణాలతో ఎస్‌బీ‌ఐలోని మొత్తం 18,973 ఉద్యోగుల సంఖ్య 15,672కి పడిపోయింది. మొత్తానికి ఈ బ్యాంకుని మరింత విస్తరించే భాగంలో త్వరలోనే 9వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు..

First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...