హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు

SBI Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు

SBI Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Junior Associate Recruitment 2021 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరోసారి భారీగా జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ జరుగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

బ్యాంకులో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో జూనియర్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 5454 ఖాళీలున్నాయి. క్లరికల్ కేడర్‌లో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అందులో హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసినవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 మే 17 లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఒక రాష్ట్రంలో ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. అభ్యర్థులకు స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ భాషలు తెలిసి ఉండాలి.

Teacher Jobs: ఏకలవ్య స్కూళ్లలో 3479 టీచర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

IIT Jobs 2021: ఐఐటీ రూర్కీలో 139 జాబ్స్... రేపే చివరి తేదీ

SBI Junior Associate Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


నోటిఫికేషన్ విడుదల- 2021 ఏప్రిల్ 26

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 27

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 17

ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుల విడుదల- 2021 జూన్

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2021 జూన్

ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2021 జూలై

మెయిన్స్ అడ్మిట్ కార్డుల విడుదల- 2021 జూలై

మెయిన్స్ ఎగ్జామ్- 2021 జూలై 31

LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా

IT Jobs: నిరుద్యోగులూ బీ రెడీ... ఇన్ఫోసిస్, టీసీఎస్‌లో 65,000 ఉద్యోగాలు

SBI Junior Associate Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం ఖాళీలు- 5454 (హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులు)

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2021 ఆగస్ట్ 16 లోగా డిగ్రీ పాస్ అయినట్టు ప్రూఫ్ చూపించాలి.

ఎంపిక విధానం- ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

First published:

Tags: Bank Jobs 2021, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Sbi, State bank of india, Telangana jobs, Upcoming jobs

ఉత్తమ కథలు