హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Jobs Notification 2022: స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

SBI Jobs Notification 2022: స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకులో (State Bank Of India) ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నంత క్రేజ్ ఉంటుంది యువతకు. దీంతో ఈ బ్యాంకులో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అనేక మంది ప్రిపేర్ అయ్యి పోటీ పడుతుంటారు. స్టేట్ బ్యాంక్ సైతం వరుసగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 10న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆషక్తి కలిగిన అభ్యర్థులు https://bank.sbi/web/careers వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీల వివరాలు:

    - ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

    -ఎంపికైన అభ్యర్థులు ముంబాయి/నేవీ ముంబాయిలో పని చేయాల్సి ఉంటుంది.

    విద్యార్హతల వివరాలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    - గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    - ఎంబీఏ విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

    SBI Recruitment 2022: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 5,008 జాబ్స్ ... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

    ఎలా అప్లై చేయాలంటే?

    - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం..

    అభ్యర్థులు https://bank.sbi/web/careers, https://www.sbi.co.in/web/careers వెబ్ సైట్లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    - అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

    - అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

    - అభ్యర్థులు దరఖాస్తు సమయంలో Resume, ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, - విద్యార్హతల సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, లేటెస్ట్ ఫామ్-16/ఐటీ రిటర్న్, కరంట్ పే స్లిప్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, State bank of india

    ఉత్తమ కథలు