SBI Jobs 2020: తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐలో 1080 ఉద్యోగాలు... జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే

SBI Apprentice Recruitment 2020 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అద్భుతమైన అవకాశం ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 8500 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: November 26, 2020, 11:44 AM IST
SBI Jobs 2020: తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐలో 1080 ఉద్యోగాలు... జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే
SBI Jobs 2020: తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐలో 1080 ఉద్యోగాలు... జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. రెండు తెలుగు రాష్ట్రాల్లో 1080 పోస్టులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి డిసెంబర్ 10 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏఏ జిల్లాల్లో ఎస్‌బీఐ ఎన్ని అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోందో తెలుసుకోండి.

Canara Bank Jobs: కెనెరా బ్యాంకులో 220 జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

SSC Recruitment 2020: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్ పాసైతే చాలు... నోటిఫికేషన్ వివరాలివే

SBI Apprentice Recruitment 2020: తెలంగాణలో ఖాళీల వివరాలు ఇవే...


తెలంగాణలో మొత్తం ఖాళీలు- 460
ఆదిలాబాద్ -10
భద్రాద్రి కొత్తగూడెం -21

జగిత్యాల -9
జనగాం -10
జయశంకర్ -12
జోగులంబా -9
కామారెడ్డి -16
కరీంనగర్ - 14
ఖమ్మం - 24
కొమరంభీమ్ -7
మహాబూబాబాద్ -12
మహబూబ్‌నగర్ -33
మల్కాజ్‌గిరి -5
మంచిర్యాల -8
మెదక్ -14
నాగర్‌కూర్నూల్ -15
నల్గొండ -22
నిర్మల్ -11
నిజామాబాద్ -39
పెద్దపల్లి -10
రంగారెడ్డి -22
సంగారెడ్డి -20
సిద్దిపేట -17
సిరిసిల్ల -6
సూర్యపేట -28
వికారాబాద్ -23
వనపర్తి -12
వరంగల్ -4
వరంగల్ రూరల్-11
యాదాద్రి భువనగిరి -16

SBI Jobs 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 8500 జాబ్స్... ఎంపిక విధానం ఇదే

Railway Jobs 2020: కొంకణ్ రైల్వేలో జాబ్స్... 2 రోజుల్లో అప్లై చేయండి

SBI Apprentice Recruitment 2020: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు ఇవే...


ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 620
శ్రీకాకళం- 33
విజయనగరం- 29
విశాఖపట్నం- 44
తూర్పుగోదావరి- 62
పశ్చిమ గోదావరి- 75
కృష్ణా- 53
గుంటూరు- 75
ప్రకాశం- 47
నెల్లూరు- 37
చిత్తూరు- 43
కడప- 51
అనంతపూర్- 28
కర్నూలు- 43

SBI Apprentice Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 20
దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 10
విద్యార్హతలు- 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.
స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.
Published by: Santhosh Kumar S
First published: November 26, 2020, 11:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading