హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Recruitment: బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్..!  

SBI Recruitment: బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్..!  

SBI Recruitment: బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్..!

SBI Recruitment: బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్..!

SBI Recruitment: ప్రభుత్వ ఉద్యోగాలకు, బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి మరో గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేయనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రభుత్వ ఉద్యోగాలకు (Government Jobs), బ్యాంక్ జాబ్స్‌ (Bank Jobs)కు ప్రిపేర్ అవుతున్న వారికి మరో గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ (Recruitment) ద్వారా క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులను భారీగా భర్తీ చేయనుంది. ఎస్బీఐ క్లర్క్ జాబ్స్‌కు అర్హత, అప్లికేషన్ ప్రాసెస్, ఇతర వివరాలు తెలుసుకుందాం.

* దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్‌ల్లో ఎస్‌బీఐ క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు సంబంధించిన 5008 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా సెప్టెంబర్ 27, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ కేటగిరి అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ఎక్స్‌ఎస్ కేటగిరి అభ్యర్థులైతే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

* ఎంపిక ప్రక్రియ

ఎస్‌బీఐ క్లర్క్ ఫోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఆ తరువాత మెయిన్ పరీక్ష జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు లోకల్ లాంగ్వేజ్‌లో సైతం నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతాయి.

* అర్హత ప్రమాణాలు

ఎస్‌బీఐ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 2022 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. లేకపోతే అందుకు సమానమైన కోర్సు అయినా చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం/సెమిస్టర్‌లో చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే 2022 నవంబర్ 30లోపు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ఎవిడెన్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ సర్టిఫికేట్ 2022 నవంబర్ 30లోపు పొంది ఉండాలి.

* పరీక్ష విధానం

ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు ఒక గంట సమయం కేటాయిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపులో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు తీసివేస్తారు.

ఇది కూడా చదవండి : అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో 30వేల ఉద్యోగాలు.. జీతం రూ.30వేలు..

* అప్లికేషన్ ప్రాసెస్

స్టెప్-1:ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేయాలి.

స్టెప్-2: హోమ్ పేజీలో కెరీర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్‌మెంట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) అనే లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-3:సీబీఐ క్లర్క్ పరీక్ష కోసం మీ వివరాలతో రిజిస్టర్ అవ్వాలి.

స్టెప్-4: ఆ తరువాత లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

స్టెప్-5: అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

స్టెప్-6:దరఖాస్తు ప్రివ్యూ చేసి సబ్‌మిట్ చేయండి.

First published:

Tags: Bank Jobs, Career and Courses, JOBS, Sbi, State bank of india

ఉత్తమ కథలు