SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్

SBI Global Ed-Vantage Student Education Loan Scheme | 'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్' స్టూడెంట్ లోన్ తీసుకున్నవాళ్లు 15 ఏళ్లల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: June 20, 2019, 12:05 PM IST
SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్
SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్ (image: SBI)
news18-telugu
Updated: June 20, 2019, 12:05 PM IST
ఫారిన్‌లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విదేశీ విద్య ఎవరికైనా భారమే. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు టాలెంట్ ఉన్నా ఆర్థిక సమస్యల కారణంగా విదేశీ విద్యకు దూరమవుతుంటారు. అలాంటివారికి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి ఎస్‌బీఐ ఆదుకోనుంది. 'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్' పేరుతో స్టూడెంట్ లోన్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. విదేశాల్లోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సులు చేయాలనుకునేవారి విద్యార్థులకు మాత్రమే ఈ రుణాలు లభిస్తాయి. 'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్'  స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్‌కు దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
SBI Global Ed-Vantage: స్టూడెంట్ లోన్ వివరాలు ఇవే

Loading...
ఏఏ దేశాలు?: అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, హాంకాంగ్, న్యూజిల్యాండ్, కెనెడా, యూరప్ దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో రెగ్యులర్ కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఈ దేశాలు కాకుండా ఇతర దేశాల్లో కోర్సులు చేయాలనుకుంటే సర్కిల్ సీజీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఏఏ కోర్సులు?: డిగ్రీ, పీజీ, డాక్టరేట్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు చేయాలనుకునేవాళ్లు 'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్' రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

లోన్‌లో ఏం కవర్ అవుతాయి?: కాలేజీ ఫీజు, లైబ్రరీ, ల్యాబ్, పరీక్షల ఫీజులు, ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, పరికరాలు, యూనిఫామ్, కంప్యూటర్ కొనుగోలు, స్టడీ టూర్, ప్రాజెక్ట్ వర్క్స లాంటివన్నీ ఈ లోన్‌లో కవర్ అవుతాయి.

లోన్ ఎంత తీసుకోవచ్చు?: 'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్' స్కీమ్‌లో విద్యార్థులు కనీసం రూ.20 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. ‘RiNn Rakhsha’ ప్రీమియం చెల్లిస్తే లోన్‌కు ఇన్స్యూరెన్స్ కవరేజీ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000.

SBI education loan, SBI Global Ed-Vantage, sbi global ed vantage scheme review, sbi global ed-vantage scheme eligibility, sbi global ed-vantage scheme rules, sbi global ed-vantage scheme interest rates, SBI online, State Bank of India, ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్, ఎస్‌బీఐ స్టూడెంట్ లోన్, ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్, ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ రూల్స్, ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ వడ్డీ, ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ స్కీమ్
(image: SBI)


వడ్డీ ఎంత?: 'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్' స్టూడెంట్ లోన్ తీసుకుంటే ఏడాదికి 10.70% వడ్డీ చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్నవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

రీపేమెంట్ ఎలా?: 'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్' స్టూడెంట్ లోన్ తీసుకున్నవాళ్లు 15 ఏళ్లల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తైన ఆరు నెలల నుంచి రీపేమెంట్ మొదలవుతుంది. ఈఎంఐ రూపంలో లోన్ తిరిగి చెల్లించొచ్చు.

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్: ఐడెంటిటీ కార్డ్ (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్), అడ్రస్ ప్రూఫ్, అకడమిక్ రికార్డ్స్, అడ్మిషన్ ఆఫర్ లెటర్, కోర్సు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చుల స్టేట్‌మెంట్, ఫోటోగ్రాఫ్స్, గతంలో ఏదైనా లోన్ ఉంటే స్టేట్‌మెంట్, కో-అప్లికెంట్ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ ఇవ్వాలి.

'ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్' స్టూడెంట్ లోన్ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్


ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు వాడని క్రెడిట్ కార్డును ఇలా క్యాన్సిల్ చేయొచ్చు

EPF Withdraw: మీ పీఎఫ్ డబ్బులు ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసా?

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...