• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • SBI CLERK RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 5237 JUNIOR ASSOCIATES POSTS HERE FULL DETAILS NS

SBI Clerk Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో డిగ్రీ అర్హతతో 5 వేలకు పైగా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

SBI Clerk Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో డిగ్రీ అర్హతతో 5 వేలకు పైగా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    మీరు బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ఇది శుభవార్తే. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 5237 పోస్టులను భర్తీ చేయనుంది ఎస్బీఐ. ఇందులో కర్క్‌ పోస్టులతోపాటు క్లరికల్‌ క్యాడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ మే 17గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. అయితే అభ్యర్థులు ఏదో ఒక రాష్ట్రం నుంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే

    విద్యార్హతల వివరాలు..
    అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1 నాటికి 10-28 ఏళ్లు ఉండాలి. పలు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

    పరీక్ష ఫీజు: అభ్యర్థులు రూ. 750ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపునకు మినహాయింపు ఇచ్చారు.
    పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జూన్ లో, మెయిన్స్ పరీక్షను జూలై 31న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Official Website - Direct Link
    Notification - Direct Link

    ఎంపిక ప్రక్రియ:
    ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దీంతో పాటు స్థానిక భాషకు సంబంధించిన ఎగ్జామ్ కూడా నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్నారు. తప్పు సమాధానికి 1/4 నెగటీవ్ మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్‌ భాషకు సంబంధించి 30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీకి మరో 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీకి మరో 35 మార్కులు ఉంటాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు నిర్వహిస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published: