హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs 2022: IDBI, SBI, NABARD పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. ఆ వివరాలిలా.. .

Bank Jobs 2022: IDBI, SBI, NABARD పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. ఆ వివరాలిలా.. .

Bank Jobs 2022: IDBI, SBI, NABARD పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. ఆ వివరాలిలా.. .

Bank Jobs 2022: IDBI, SBI, NABARD పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. ఆ వివరాలిలా.. .

Bank Jobs 2022: బ్యాంకింగ్‌లో కెరీర్ కోసం చూస్తున్నారా..? ఇక్కడ వివిధ బ్యాంకుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఆ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

బ్యాంకింగ్‌లో కెరీర్ కోసం చూస్తున్నారా..? ఇక్కడ వివిధ బ్యాంకుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లను(Notifications) విడుదల చేశారు. SBI లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్ట్‌ల నుండి NABARD డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్ట్‌ల వరకు కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ఉద్యోగ అవకాశాల జాబితా ఇక్కడ ఉంది. అభ్యర్థులు ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, దరఖాస్తు ఫారమ్(Application Form), అధికారిక వెబ్‌సైట్(Website) మరియు ఇతర వివరాలను ఇక్కడ చూడవచ్చు.

IDBI రిక్రూట్‌మెంట్ 2022..

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన హెడ్ - డేటా అనలిటిక్స్ అండ్ ఇతర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను recruitment@idbi.co.inకు సెప్టెంబర్ 30 లేదా అంతకు ముందు పంపవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, బ్యాంక్‌లో మొత్తం 03 పోస్టులు భర్తీ చేస్తారు.

పోస్ట్ పేరు: హెడ్ - డేటా అనలిటిక్స్

అధికారిక వెబ్‌సైట్: idbibank.in.

చివరితేదీ: సెప్టెంబర్ 30.

NABARD రిక్రూట్‌మెంట్ 2022..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ( నాబార్డ్ ) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 10, 2022. ఆసక్తి గల అభ్యర్థులు NABARD అధికారిక వెబ్‌సైట్ nabard.org ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .

పోస్ట్ పేరు: డెవలప్‌మెంట్ అసిస్టెంట్

అధికారిక వెబ్‌సైట్: nabard.org

చివరితేదీ: అక్టోబర్ 10.

SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2022 ..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) బ్యాంక్‌లోని క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానించింది. అర్హతగల అభ్యర్థులు బ్యాంక్ sbi/careers అండ్ sbi.co.in లో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 27, 2022. అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది.

పోస్ట్ పేరు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్ట్‌లు

అధికారిక వెబ్‌సైట్: bank.sbi/careers మరియు sbi.co.in.

చివరితేదీ: సెప్టెంబర్ 27.

Jobs In NIIH: స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. జీతం రూ. 64వేలు..

SBI PO రిక్రూట్‌మెంట్ 2022..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరులను నియమిస్తోంది. అర్హత గల అభ్యర్థులు sbi.co.in/careers అండ్ sbi.co.in లో SBI యొక్క కెరీర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1673 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 12, 2022.

పోస్ట్ పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులు

అధికారిక వెబ్‌సైట్: sbi.co.in.

చివరితేదీ: అక్టోబర్ 12

IT Jobs 2022: ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా.. ఈ కంపెనీలో 10 వేల ఖాళీలకు నియామకాలు..

HP స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2022..

దేశంలోని ప్రముఖ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ హిమాచల్ ప్రదేశ్‌లోని అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్, HP స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. IBPS, ముంబై ద్వారా రెగ్యులర్ బేసిస్‌లో వీటిని భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.hpscb.comని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చేస్తారు.

పోస్ట్ పేరు: అసిస్టెంట్ మేనేజర్

అధికారిక వెబ్‌సైట్: www.hpscb.com.

చివరితేదీ: సెప్టెంబర్ 30

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Idbi, JOBS, NABARD, Sbi

ఉత్తమ కథలు