SBI CLERK EXAM 2021 BEGINS FROM TODAY THESE INSTRUCTIONS TO BE FOLLOWED BY CANDIDATES ON EXAM DAY NS GH
SBI Clerk Exam: ఎస్బీఐ క్లర్క్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి
ప్రతీకాత్మక చిత్రం
జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) కోసం SBI ప్రిలిమినరీ పరీక్షలను ఈ రోజు నుంచి నిర్వహిస్తోంది. ఈ ఎస్బీఐ క్లర్క్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పకుండా ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా.. జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) కోసం ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే షిల్లాంగ్, ఔరంగాబాద్, నాసిక్‌లో మాత్రం పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పరీక్ష జరగనుంది. కాగా ఎస్బీఐ క్లర్క్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కాల్‌లెటర్‌లో ఉన్న రిపోర్టింగ్ టైమ్, ఎగ్జామ్ సెంటర్, రోల్నంబర్ను జాగ్రత్తగా పరిశీలించి సిద్ధం కావాలి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభ సమయం కంటే 15 నిమిషాల ముందే అభ్యర్థులు తప్పకుండా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. భౌతిక దూరం నేపథ్యంలో అభ్యర్థులకు పరీక్ష కంటే ఒకరోజు ముందే ఈమెయిల్, ఎస్ఎంఎస్ వస్తుంది. పరీక్ష కేంద్రాల వద్ద గుమికూడకుండా రావాల్సిన సరైన సమయం అందులో ఉంటుంది. కాల్లెటర్లోనూ ఎగ్జామ్ టైమ్ ఉంటుంది. ఒకవేళ మెయిల్, ఎస్ఎంఎస్ రాకపోయినా కాల్‌లెటర్ ప్రింట్ తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ పరీక్ష సమయం ప్రారంభం కంటే ఆలస్యంగా వెళ్తే మాత్రం, లోపలికి అనుమతించరు. Free Coaching for IBPS Exams: ఐబీపీఎస్ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి.. పూర్తి వివరాలివే
ఫొటో తప్పనిసరి
కాల్లెటర్పై పాస్‌పోర్ట్ సైజు ఫొటోను తప్పకుండా అతికించాలి. దాంతో పాటు రెండు ఫొటోలను తీసుకెళ్లాలి. అలాగే ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డును, జిరాక్స్‌లను తప్పకుండా తీసుకెళ్లాలి. అవి లేకుండా పరీక్షకు అనుమతించరు. కాల్లెటర్పై సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. కాల్‌లెటర్‌ను ప్రిలిమినరీ ఎగ్జామ్హాల్లో తీసుకోరు. అయితే దానిపై ఎగ్జామ్ అధికారులు స్టాంప్ వేస్తారు. దీన్ని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మెయిన్ ఎగ్జామ్ సమయంలో ఈ డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
పరీక్ష విధానం
ఆల్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ టెస్టుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష పూర్తి చేసేందుకు గంట సమయం ఉండగా.. మూడు సెక్షన్లుగా ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజీకి 30 మార్కులు (20 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీకి 35 మార్కులు(20 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్కుల (20 నిమిషాలు) కేటాయింపు ఉంటుంది. ప్రతీ సెక్షన్‌కు సపరేట్ టైమింగ్ ఉంటుంది.
అలాగే ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి ¼ మార్కు మైనస్ వర్తిస్తుంది. వచ్చే మొత్తం మార్కుల్లో దీన్ని కట్ చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో మంచి ప్రదర్శన చేసిన వారిని బ్యాంకు మెయిన్ ఎగ్జామినేషన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.