స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు రాష్ట్రాల్లో 1,226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 డిసెంబర్ 29 లోగా దరఖాస్తు చేయాలి. విద్యార్హతలు, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎస్బీఐ ఎలా ఎంపిక చేస్తారు? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఏం చదవాలి? అన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్ రాతపరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది. ఆన్లైన్ రాతపరీక్షలో ఆబ్జెక్టీవ్ టెస్ట్ 120 మార్కులకు, డిస్క్రిప్టీవ్ టెస్ట్ 50 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టీవ్ టెస్ట్‌లో మొత్తం నాలుగు సెక్షన్స్ ఉంటాయి. సమయం 2 గంటలు. ఆబ్జెక్టీవ్ టెస్ట్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. బ్యాంకింగ్ నాలెడ్జ్‌లో 40 మార్కులకు 40 ప్రశ్నలు ఉంటాయి. సమయం 40 నిమిషాలు. జనరల్ అవేర్నెస్, ఎకానమీలో 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 20 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. సమయం 120 నిమిషాలు అంటే రెండు గంటలు.
ఆబ్జెక్టీవ్ టెస్ట్‌తో పాటు 30 నిమిషాలు డిస్క్రిప్టీవ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు సంబంధించిన రెండు ప్రశ్నలు ఉంటాయి. లెటర్ రైటింగ్, ఎస్సే లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ సెక్షన్లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టీవ్ టెస్ట్, డిస్క్రిప్టీవ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తుంది ఎస్బీఐ. ఖాళీల సంఖ్య కన్నా మూడు రెట్లు అభ్యర్థులను స్క్రీనింగ్‌కు పిలుస్తారు. స్క్రీనింగ్‌లో ఆన్లైన్ అప్లికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్క్రీనింగ్ పూర్తైన తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు కనీస క్వాలిఫయింగ్ మార్కులు సాధించాలి. కనీస క్వాలిఫయింగ్ మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఓబీసీ కేటగిరీలో ఇంటర్వ్యూకు అటెంట్ అయ్యేవారు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. లేకపోతే జనరల్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణిస్తారు.
ఫైనల్ సెలెక్షన్
అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ క్వాలిఫై కావాలి. ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూకు 75:25 చొప్పున వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా తుది మెరిట్ లిస్ట్‌ను రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ఎస్బీఐ. ఫలితాలు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో విడుదలవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.