Home /News /jobs /

SBI CBO RECRUITMENT 2021 STATE BANK OF INDIA INVITES APPLICATIONS FOR 1226 CIRCLE BASED OFFICER POSTS KNOW HOW TO APPLY SS

SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో ఎస్‌బీఐలో 1,226 జాబ్స్... అప్లై చేయండి ఇలా

SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో ఎస్‌బీఐలో 1,226 జాబ్స్... అప్లై చేయండి ఇలా
(image: SBI)

SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో ఎస్‌బీఐలో 1,226 జాబ్స్... అప్లై చేయండి ఇలా (image: SBI)

SBI CBO Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో జాబ్ నోటిఫికేషన్ ద్వారా 1,226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు కొద్ది రోజుల క్రితమే జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 29 లాస్ట్ డేట్. గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.

    SBI CBO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే













































    సర్కిల్ పేరురెగ్యులర్ ఖాళీలుబ్యాక్‌లాగ్ ఖాళీలు
    అహ్మదాబాద్30054
    బెంగళూరు25028
    భోపాల్15012
    భోపాల్502
    చెన్నై25026
    జైపూర్1004
    1100126

    Jobs in TCS: కరోనా టైమ్‌లో బీటెక్ పాస్ అయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    SBI CBO Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://bank.sbi/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.

    Step 3- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

    Step 4- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 5- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

    Step 6- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 7- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 8- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 9- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    Step 10- ఐదో దశలో ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, రెజ్యూమె, విద్యార్హతల సర్టిఫికెట్స్, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్స్, సాలరీ స్లిప్, ఫామ్ 16 లాంటి ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    Step 11- ఆరో దశలో రూ.750 ఫీజు పేమెంట్ చేయాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

    Step 12- చివరగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

    అభ్యర్థులు 2021 డిసెంబర్ 29 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేయడానికి 2021 డిసెంబర్ 29 చివరి తేదీ. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి 2022 జనవరి 13 వరకు అవకాశం ఉంది. 2022 జనవరి 12 నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేయొచ్చు. 2022 జనవరిలోనే ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, Sbi, State bank of india

    తదుపరి వార్తలు