Home /News /jobs /

SBI CBO Recruitment 2021: ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI CBO Recruitment 2021: ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI CBO Recruitment 2021: ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

SBI CBO Recruitment 2021: ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

SBI CBO Recruitment 2021 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు రాష్ట్రాల్లో 1,226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎస్‌బీఐ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ వేకెన్సీస్‌ని భర్తీ చేస్తోంది. మొత్తం 1,226 పోస్టులున్నాయి. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1100 ఉండగా, బ్యాక్‌లాగ్ పోస్టులు 126 ఉన్నాయి. ఈ పోస్టులకు 2021 డిసెంబర్ 9న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 29 చివరి తేదీ. అభ్యర్థులకు 2022 జనవరిలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది.

    ఈ నోటిఫికేషన్ ద్వారా గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా దరఖాస్తులు సబ్మిట్ చేస్తే అప్లికేషన్స్ స్వీకరించరు. ఖాళీల సంఖ్య, విద్యార్హతలు, జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

    Air India Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు

    SBI CBO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





















































    సర్కిల్ రాష్ట్రం రెగ్యులర్ ఖాళీలు బ్యాక్‌లాగ్ ఖాళీలు
    అహ్మదాబాద్ గుజరాత్ 300 54
    బెంగళూరు కర్నాటక 250 28
    భోపాల్ మధ్యప్రదేశ్ 150 12
    భోపాల్ చత్తీస్‌గఢ్ 50 2
    చెన్నై తమిళనాడు 250 26
    జైపూర్ రాజస్తాన్ 100 4
    మొత్తం ఖాళీలు 1100 126

    SBI CBO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 9

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 29

    దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2021 డిసెంబర్ 29

    ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2021 డిసెంబర్ 9 నుంచి 2021 డిసెంబర్ 29 వరకు

    దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2022 జనవరి 13

    కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2022 జనవరి 12 నుంచి

    ఆన్‌లైన్ టెస్ట్- 2022 జనవరి

    Indian Amry Jobs: బీటెక్ పాస్ అయ్యారా? ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం



    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    SBI CBO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

    అనుభవం- ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

    ఇతర నిబంధనలు- షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సబ్సిడరీస్‌లో పనిచేస్తున్నవారు, ఎస్‌బీఐలో క్లరికల్, సూపర్‌వైజర్ కేడర్‌లో పనిచేసినవారు, ఎస్‌బీఐలో ఆఫీసర్ గ్రేడ్ నుంచి రిజైన్ చేసినవారు దరఖాస్తు చేయకూడదు.

    దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు

    వయస్సు- 2021 డిసెంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ

    వేతనం- రూ.36,000 బేసిక్ వేతనంతో రూ.63,840.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు