SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే

SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Apprentice Recruitment 2021 | ఎస్‌బీఐలో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేశారా? ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దేశవ్యాప్తంగా 6100 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో 125, ఆంధ్రప్రదేశ్‌లో 100 పోస్టులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అప్రెంటీస్ పోస్టులకు డిగ్రీ అర్హత కావడంతో లక్షల్లో అభ్యర్థులు అప్లై చేశారు. 2021 ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈ పోస్టులకు ఎస్‌బీఐ ఎలా ఎంపిక చేస్తుంది? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది? అన్న అనుమానాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. మరి ఎస్‌బీఐలో అప్రెంటీస్ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, ఏఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలో తెలుసుకోండి.

    అప్రెంటీస్ పోస్టులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ద్వారా ఎంపిక చేయనుంది ఎస్‌బీఐ. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం ఒక గంట. జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు. జనరల్ ఇంగ్లీష్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు. క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు.

    Principal Jobs: మొత్తం 363 ప్రిన్సిపాల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    Head Constable Jobs: హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఇంటర్ పాస్ అయితే చాలు

    ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలో హైదరాబాద్, కరీంగనర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. రాతపరీక్షలో ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషలో ఉంటాయి. నెగిటీవ్ మార్కింగ్ ఉంది. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. మినిమమ్ క్వాలిఫయింగ్ మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు, కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తుంది ఎస్‌బీఐ. ఇద్దరికీ సేమ్ కటాఫ్ మార్కులు వస్తే వయస్సు ఆధారంగా ఒకరిని ఎంపిక చేస్తారు.

    UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం

    Constable Jobs: టెన్త్ పాసయ్యారా? 25,271 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయండి ఇలా

    రాతపరీక్షలో క్వాలిఫై అయినవారికి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి. ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే అప్రెంటీస్ పోస్టుకు అర్హులు. టెన్త్ లేదా ఇంటర్‌లో స్థానిక భాషలో చదివినవారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్‌తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాతే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published: