SBI APPRENTICE RECRUITMENT 2020 STATE BANK OF INDIA RELEASED NOTIFICATION WITH 8500 APPRENTICE POSTS KNOW ALL DETAILS SS
SBI Jobs 2020: డిగ్రీ పాసైనవారికి ఉద్యోగాల జాతర... 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించిన ఎస్‌బీఐ
SBI Jobs 2020: డిగ్రీ పాసైనవారికి ఉద్యోగాల జాతర... 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించిన ఎస్‌బీఐ
(ప్రతీకాత్మక చిత్రం)
SBI Apprentice Recruitment 2020 | డిగ్రీ పాసయ్యారా? డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల జాతరకు తెరతీసింది. ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించరు. ఎంపికైనవారికి మూడేళ్లు ట్రైనింగ్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇప్పటికే డిగ్రీ అర్హతతో 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్‌బీఐ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 10 చివరి తేదీ. 2021 జనవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.
SBI Apprentice Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 20
దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 10
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 10
ఆన్‌లైన్ ఫీజు పీమెంట్- 2020 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 25
SBI Apprentice Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.
స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.