SBI Jobs 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 8500 జాబ్స్... ఎంపిక విధానం ఇదే

SBI Jobs 2020 | డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎంపిక విధానం తెలుసుకోండి.

news18-telugu
Updated: November 25, 2020, 3:17 PM IST
SBI Jobs 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 8500 జాబ్స్... ఎంపిక విధానం ఇదే
SBI Jobs 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 8500 జాబ్స్... ఎంపిక విధానం ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 4 లాస్ట్ డేట్. ఎస్‌బీఐ ప్రకటించిన 8500 ఉద్యోగాల్లో తెలంగాణలో 460, ఆంధ్రప్రదేశ్‌లో 620 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైనవారు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేయనుంది ఎస్‌బీఐ. ఒకేసారి 8500 పోస్టుల్ని భర్తీ చేయడంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అర్హత డిగ్రీ కావడంతో లక్షల మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. మరి ఈ పోస్టులకు ఎంపిక విధానం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

MIDHANI Jobs 2020: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

Railway Jobs 2020: కొంకణ్ రైల్వేలో జాబ్స్... 2 రోజుల్లో అప్లై చేయండి

ఎస్‌బీఐలో 8500 పోస్టులకు రెండు పరీక్షల ద్వారా ఎంపిక చేయనుంది బ్యాంకు. ఇందులో మొదటిది రాత పరీక్ష. 2020 జనవరిలో ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. మొత్తం 100 మార్కులు ఉంటాయి. జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ టాపిక్స్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు 15 నిమిషాల చొప్పున పరీక్ష 60 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి. నెగిటీవ్ మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కును తగ్గిస్తారు. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గుతుంది.

Indian Air Force Jobs: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

Canara Bank Jobs: కెనెరా బ్యాంకులో 220 ఉద్యోగాలు... విద్యార్హతలు ఇవే

ఎస్‌బీఐ అప్రెంటీస్ పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో క్వాలిఫై కావడానికి కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5% సడలింపు ఉంటుంది. మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్‌ను బ్యాంకు నిర్ణయిస్తుంది. రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఇవే అంశాలపై లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయితేనే అప్రెంటీస్ అవకాశం ఉంటుంది. తుది నియామకం ముందు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: November 25, 2020, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading