హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS EAMCET Exam Tips: ఎంసెట్ పరీక్ష హాల్లో.. టైం సేవ్ చేసుకోవడానికి ఇలా చేయండి..

TS EAMCET Exam Tips: ఎంసెట్ పరీక్ష హాల్లో.. టైం సేవ్ చేసుకోవడానికి ఇలా చేయండి..

TS EAMCET Exam Tips: ఎంసెట్ పరీక్ష హాల్లో.. టైం సేవ్ చేసుకోవడానికి ఇలా చేయండి..

TS EAMCET Exam Tips: ఎంసెట్ పరీక్ష హాల్లో.. టైం సేవ్ చేసుకోవడానికి ఇలా చేయండి..

TS EAMCET Exam Tips: ఎంపీసీ మరియు బైపిసి స్టూడెంట్స్ కి ఎంసెట్ ఎగ్జామ్ లో టైం సెన్స్ చాలా ముఖ్యము. ఏ సబ్జెక్టుని ముందుగా స్టార్ట్ చేయడం వలన టైం సేవ్ అవుతుందో తప్పనిసరిగా చూసుకోవడం మంచిది.

(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ ప్రతినిధి, న్యూస్ 18) 

తెలంగాణలో భారీ వర్షాల (Telangana Heavy Rains) నేపథ్యంలో ఎంసెట్ (Telangana EAMCET) అగ్రికల్చర్ పరీక్ష వాయిదా పడింది. రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేయడంతో.. జులై 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ (TS EAMCET 2022) అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కేవలం అగ్రికల్చర్ పరీక్ష (TS EAMCET Agriculture Exam)ను మాత్రమే వాయిదా వేస్తున్నామని.. జులై 18 నుంచి 20 వరకు జరగాల్సి ఉన్న ఇంజినీరింగ్ పరీక్షల(TS EAMCET Engineering Exam)ను యథావిధిగా నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. వాయిదా పడిన అగ్రికల్చర్ పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఉన్న విద్యామండలి తెలిపింది. అయితే ఈ ఎగ్జామ్ కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఎంసెట్ పరీక్షా రాసే సమయంలో ఎలాంటి వెలకువలు పాటించాలి అనే విషయాలను మహబూబ్ నగర్ ప్రతిభ జూనియర్ కళాశాల ఫిజిక్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

MANUU Jobs 2022: డిగ్రీ అర్హతతో.. మనూ(MANUU)లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..


ముందుగా 2022 లో ఎంసెట్ రాయబోయే విద్యార్థిని విద్యార్థులకు శుభాభినందనలు తెలిపాడు. ఎంపీసీ మరియు బైపిసి స్టూడెంట్స్ కి ఎంసెట్ ఎగ్జామ్ లో టైం సెన్స్ చాలా ముఖ్యము. ఏ సబ్జెక్టుని ముందుగా స్టార్ట్ చేయడం వలన టైం సేవ్ అవుతుందో తప్పనిసరిగా చూసుకోవడం మంచిదన్నారు.  ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ కంటే ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ఫిజిక్స్ అని తెలియజేశాడు.

సాధారణంగా మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రము మిగిలిన సబ్జెక్ట్స్ ప్రశ్నాపత్రాల కంటే హార్డ్ గా ఉంటుంది. కావున మాథెమాటిక్స్ పేపర్ ని ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పేపర్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే టైమ్ సేవ్ అవుతుందన్నారు. బైపీసీ స్టూడెంట్స్ కూడా ... ఫిజిక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నారు.

EAMCET Chemistry Preparation Tips: ఈ టిప్స్ పాంటిస్తే.. ఎంసెట్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ సాధించొచ్చు..


ప్రిపరేషన్ కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్నందున.. కాన్సెంట్రేట్ చేయాల్సింది ఫస్ట్ ఇయర్లో ఈజీ టాపిక్స్ పై అన్నారు. అవి ఏంటి అంటే మోడ్రన్ ఫిజిక్స్ పార్ట్ లో చాలా ఈజీ లెసన్స్ అయినటువంటి కెనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, గ్రావిటేషన్ యూనిట్స్, డైమెన్షన్స్ మరియు థర్మోడైనమిక్స్. సెకండ్ ఇయర్ లో మాడ్రన్ ఫిజిక్స్ పార్ట్ లో డ్యూ అలైరేషన్ ఆఫ్ మేటర్ మరియు రేడియేషన్ ఆటమ్స్, న్యూక్లియట్ సెమీ కండక్టర్ డివైసెస్, ఎలక్ట్రో మాగ్నెటిక్ వీస్ ఎలక్ట్రిక్ పార్ట్ లో కెపాసిటర్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ మూవింగ్ చార్జెస్ మాగ్నెటిసం, మాగ్నెటిసం మరియు మ్యాటర్ వీటిని బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజిక్స్ చదివేటప్పుడు ప్రాక్టీస్ చేయడము చాలా అవసరం.

IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా

ఆప్టిక్స్ లో కాన్సంన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ వేవ్ టాపిక్స్ మరియు పోలరైజేషన్. ఫస్ట్ ఇయర్ లో గ్రావిటేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, వర్క్ , ఎనర్జీ, పవర్ డైమెన్షన్స్, వెక్టార్స్ థర్మోడైనమిక్స్ మరియు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వీటి యొక్క ఫార్ములాస్ ని రివైజ్ చేసుకోవాలి. మెయిన్స్ ఎగ్జామ్ లో 90 ప్రశ్నలకు గాను మూడు గంటల సమయము ఇవ్వడం జరుగుతుంది. అదే ఎంసెట్ ఎగ్జామ్ లో 160 ప్రశ్నలకు గాను మూడు గంటల సమయం ఉంటుంది . అందువలన ఎంసెట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు టైం సెన్స్ చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.

First published:

Tags: Career and Courses, JOBS, Preparation, Ts eamcet, TS EAMCET 2022

ఉత్తమ కథలు