SAT TO BE HELD ONLINE EXAM PATTERN CHANGED TOO GH VB
SAT Exam: ఇకపై డిజిటల్ విధానంలోనే శాట్ పరీక్ష.. మారిన ఎగ్జామ్ ప్యాటర్న్, టైమింగ్స్.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
ఇతర దేశాల్లో బ్యాచిలర్ కోర్సులు చేయాలనుకొనే వారు ఇంటర్ తర్వాత రాయాల్సిన పరీక్ష శాట్ (స్కాలస్టిక్ అస్సెస్మెంట్ టెస్ట్)(SAT-scholastic assesment test). ఇప్పుడు ఈ ప్రవేశ పరీక్షలో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఉన్న విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో చదవడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్(Post Graduation) కోర్సులతో పోలిస్తే బ్యాచిలర్ కోర్సులను చదవడానికి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. ఇతర దేశాల్లో బ్యాచిలర్ కోర్సులు చేయాలనుకొనే వారు ఇంటర్ తర్వాత రాయాల్సిన పరీక్ష శాట్ (స్కాలస్టిక్ అస్సెస్మెంట్ టెస్ట్)(SAT-scholastic assessment test). ఇప్పుడు ఈ ప్రవేశ పరీక్షలో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. పరీక్ష సమయం(exam time), ప్రశ్నాపత్రం సరళి(exam pattern) కూడా మారాయి. పరీక్షలో సబ్జెక్టులు, మార్కుల కేటాయింపు మారక పోయినా, ప్రశ్నల సరళిలో మార్పులు చోటుచేసుకొన్నాయి.
ఇప్పుడు శాట్ ఎగ్జామ్ను కొత్త తరహాలో నిర్వహించనున్నారు. గతంలో విద్యార్థులకు మూడు గంటల సమయం ఇచ్చే వారు, ఇప్పుడు కేవలం రెండు గంటల్లో మాత్రమే సమాధానాలు అందించాలి. మొత్తంగా 1,600 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అందులో కొత్తగా షార్టర్ రీడింగ్ ప్యాసేజ్(shorter reading passage) వంటి ప్రశ్నలు అదనంగా చేర్చారు. ఈ పరీక్ష నిర్వహించే ‘ద కాలేజీ బోర్డ్’ శాట్ నిర్వహణ విభాగం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2023వ సంవత్సరానికి సంబంధించి అన్ని అంతర్జాతీయ కళాశాలల్లో చేరాలనుకొనే విద్యార్థులకు శాట్ డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తామని, అమెరికాలో బ్యాచిలర్ కోర్సులు చేయాలనుకొనే వారికి 2024 నుంచి నిర్వహిస్తామని పేర్కొంది.
ఈ పరీక్ష నిర్వహించే ‘ద కాలేజీ బోర్డ్’ వైస్ ప్రెసిడెంట్ ప్రిస్కిల్ల రోడ్రిగెజ్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన మార్పులతో శాట్ నిర్వహణ, రాయడం సులువుగా ఉంటుందని చెప్పారు. కేవలం పరీక్షను డిజిటల్ పద్దతిలోకి మార్చలేదని, ఇందులో ఉన్న అవకాశాలను పరిశీలించామని పేర్కొన్నారు. పరీక్షను సమర్థంగా నిర్వహించేందుకు విద్యా నిపుణులు, విద్యార్థుల సూచనలు, అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను సైతం తీర్చేలా వస్తున్న కొత్త మార్పులను అందుకొని మెరుగైన ఫలితాలు సాదించేలా కృషి చేస్తూ ఉంటామని స్పష్టం చేశారు. కొత్త మార్పులతో ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించేందుకు లభించే సరాసరి సమయం పెరిగిందని, షార్టర్ రీడింగ్ ప్యాసెజ్ లతో ఎక్కువ అంశాలలో అభ్యర్థులను పరిశీలించమని కాలేజ్ బోర్డ్ అభిప్రాయపడింది.
విద్యార్థులకు మరో శుభవార్త కూడా ఉంది.. గణితం(mathematics) విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే సమయంలో క్యాలిక్యులేటర్(calculator) వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో పరీక్ష నిర్వహించడం ద్వారా అందరి విద్యార్థులకు వేరు వేరుగా ప్రశ్నల క్రమం ఉంటుందని, జావాబులను చెప్పడం, తెలుసుకోవడం వంటివి కుదరవని, అవకతవకలకు అవకాశం(impossible to share answers) ఉండదాని నిర్వాహకులు చెబుతున్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఆన్సర్స్ ఆటోమేటిక్ గా సేవ్( auto save) అవుతుంటాయని, ఏదైనా కారణాల వల్ల ఇచ్చిన సమాధానాలు డిలీట్ అయ్యి అవాంతరాలు కలిగే ప్రమాదం లేదని చెప్పారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.