హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Constable Jobs 2022: 10వ తరగతి అర్హతతో.. 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

Constable Jobs 2022: 10వ తరగతి అర్హతతో.. 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

Constable Jobs 2022: 10వ తరగతి అర్హతతో.. 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

Constable Jobs 2022: 10వ తరగతి అర్హతతో.. 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

సశాస్త్ర సీమ బల్‌లో(SSB) 399 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు (Applications) కోరుతోంది. జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification)  విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణులై, అఖిల భారత స్థాయిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సశాస్త్ర సీమ బల్‌లో(SSB) 399 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు (Applications) కోరుతోంది. జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification)  విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణులై, అఖిల భారత స్థాయిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 15. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.  దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతనాలు, ఎంపిక విధానం మొదలైన ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడింది.

విద్యా అర్హత: అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయాల నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 23 సంవత్సరాలు ఉండాలి.

Software Jobs: వార్షిక ప్యాకేజీ రూ.60 లక్షలు.. ఈ కోర్సులు నేర్చుకుంటే ఈ ప్యాకేజీతో ఉద్యోగం పొందొచ్చు..

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

చెల్లింపు విధానం : పోస్టల్ ఆర్డర్ మరియు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ

SSC Results: ఆ ఫలితాలను విడుదల చేసిన SSC.. Results, కట్ ఆఫ్ మార్కులను చెక్ చేసుకోండిలా..

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 15 సెప్టెంబర్ 2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 15 అక్టోబర్ 2022

ముఖ్యమైన సమాచారం..

అధికారిక నోటిఫికేషన్ PDF: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్: ssbrectt.gov.in

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2 : అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారమ్‌లో పూర్తి వివరాలను పూరించండి.

Step 3 : కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం సరైన ఇమెయిల్ ఐడి , మొబైల్ నంబర్, ఐడి ప్రూఫ్, వయస్సు, విద్యార్హత, ఇటీవలి ఫోటోను అందించాలి.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Step 4 : మీ కేటగిరీ ప్రకారం దరఖాస్తు ఫీజును చెల్లించండి. దాని సమాచారాన్ని అప్‌లోడ్ చేయండి.

Step  5 : మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత.. అందించిన వివరాలు సరైనవో కాదో తనిఖీ చేసి, సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.

Step 6 : చివరగా అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల మేరకు దగ్గరు ఉంచుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Ssb, Telangana constable

ఉత్తమ కథలు