ఇటీవల పలు బ్యాంకులు ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తున్నాయి. తాజాగా Saraswat Bank నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆఫీసర్ విభాగంలో 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు (Bank Jobs) దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 22న ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. BOI Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. Step 1:అభ్యర్థులు మొదటగా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.saraswatbank.com/index.aspx ను ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం హోం పేజీలో Careers లింక్ పై క్లిక్ చేయాలి. Step 3:అనంతరం జూనియర్ ఆఫీసర్ పోస్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. Step 4:అప్లికేషన్ ఫామ్ లో కావాల్సిన వివరాలను నమోదు చేసిన అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి. Step 5:అనంతరం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. RBI: ఆర్బీఐలో ఇంటర్న్షిప్.. నెలకు రూ.20,000 స్టైఫండ్.. ఒక్క రోజే చాన్స్!
బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక ప్రక్రియ:
అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ ద్వారా ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.