ఆ విద్యార్థులకు Samsung శుభవార్త.. రూ. 2 లక్షల స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

Samsung Star Scholar Program: సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో పేరొందిన శాంసగ్ సంస్థ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించేందుకు స్కాలర్ షిప్ లు అందిస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా సంస్థ కీలక ప్రకటన చేసింది.

 • Share this:
  సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో పేరొందిన శాంసగ్ సంస్థ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించేందుకు స్కాలర్ షిప్ లు అందిస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో చేరిన జవహార్ నవోదయ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు ప్రకటించింది. శాంసంగ్ స్టార్ స్కాలర్ ప్రోగ్రాం పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందిన విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు అందించనున్నారు.

  JEE మెయిన్ లో విద్యార్థులు పొందిన ర్యాంకు ఆధారంగా 150 మంది విద్యార్థులను ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేయనున్నారు. జనవరి 25 వరకు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులను ప్రొత్సహించేందకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ తెలిపింది. భవిష్యత్ లో ఇలాంటి స్కాలర్ షిప్ ప్రోగ్రాంలు మరిన్ని నిర్వహించేందుకు తాము ఆలోచిస్తుననట్లు వివరించింది.

  ఇదిలా ఉంటే శాంసగ్ ఇండియా, నవోదయ విద్యాలయ 2013 నుంచి కలిసి పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 583 నవోదయ విద్యాలయాల్లో శాంసగ్ స్మార్ట్ క్లాసులను నిర్వహిస్తూ విద్యార్థులకు సహాయ పడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా 4.37 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూరుతోంది. 8.1 వేల మంది టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published: