Home /News /jobs /

Samsung Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. శామ్‌సంగ్‌లో 1,000 ఇంజ‌నీరింగ్ జాబ్స్‌

Samsung Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. శామ్‌సంగ్‌లో 1,000 ఇంజ‌నీరింగ్ జాబ్స్‌

శామ్‌సంగ్ జాబ్స్‌

శామ్‌సంగ్ జాబ్స్‌

Samsun Jobs: ఈ ఏడాది నియామకాలు చేపట్టే మొత్తం 1,000 ఉద్యోగాల్లో 250 మందికి ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఇవ్వనున్నట్టు వాధవన్ తెలిపారు. శామ్‌సంగ్ (Samsung) పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో ఇప్పటికే 10,000 మంది ఇంజనీర్లు (Engineers) పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది క్యాంపస్‌ (Campus) ల నుంచి తీసుకున్న వారే.

ఇంకా చదవండి ...
కాలేజీ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది టెక్ దిగ్గజం శామ్‌సంగ్ (Samsung). మనదేశంలో ప్రఖ్యాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతో (IIT) పాటు ఇతర ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో కేవలం ఐఐటీల నుంచే 260 మందిని తీసుకోనున్నట్టు శామ్‌సంగ్ ఇండియా మానవ వనరుల విభాగం హెడ్ సమీర్ వాధవన్ తెలిపారు. మిగిలిన వారిని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (Nation Institute of Technology), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indian Institute of  Information Technology), బిట్స్ పిలానీ వంటి ఇతర సంస్థల నుంచి తీసుకోవాలని శామ్‌సంగ్ కంపెనీ యోచిస్తోంది. ఢిల్లీ (Delhi), మద్రాస్ (Madras), బాంబే, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ, భువనేశ్వర్, గౌహతి, తిరుపతి (Tirupati), పాలక్కాడ్, ఇండోర్ (Indore), గాంధీనగర్ ఐఐటీలతోపాటు, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, జోధ్‌పూర్, గోవాల్లోని ఐఐటీల నుంచి కూడా నియామకాలు జరపనున్నారు.

ఈ ఏడాది నియామకాలు చేపట్టే మొత్తం 1,000 ఉద్యోగాల్లో 250 మందికి ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఇవ్వనున్నట్టు వాధవన్ తెలిపారు. శామ్‌సంగ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో ఇప్పటికే 10,000 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది క్యాంపస్‌ల నుంచి తీసుకున్న వారే.

DCCB Recruitment 2021: క‌డ‌ప‌ డీసీసీబీలో 75 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, జీతం వివ‌రాలు


శామ్‌సంగ్ ఇండియా చివరిసారిగా 2019లో 1200 మంది ఇంజనీర్లను (Engineers) క్యాంపస్‌ల నుంచి తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక ఇంజనీరింగ్ కాలేజీల పరీక్షలు వాయిదా వేశారు. 2020-2021లో ఎంపిక చేసిన వారిని విధుల్లోకి తీసుకునే ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమైంది. అనిశ్చితి నెలకొన్నా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది.

మూడు కేంద్రాల్లో..
శామ్‌సంగ్ కంపెనీ బెంగళూరు, ఢిల్లీ, నొయిడా (Noida)ల్లోని మూడు పరిశోధన, అభివ‌ృద్ధి (Research and Development) కేంద్రాల్లో వీరిని నియమించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, నెట్‌వర్క్‌లతోపాటు, ఇతర కొత్త టెక్నాలజీలు, డిజిటల్ సొల్యూషన్స్ విభాగాల్లో ఇంజనీర్లను సంస్థ నియమించుకోనుంది.

Bank Exam Preparation: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏం చ‌ద‌వాలి?


భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం
దక్షిణకొరియాకు చెందిన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ల (Smart Phone) తయారీలో దూసుకుపోతోంది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంస్థ వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. అగ్రదేశాల్లోని కంపెనీలకు శామ్‌సంగ్ నాణ్యమైన ఉత్పత్తులతో సవాల్ విసురుతోంది. దక్షిణకొరియా (South Korea) జీడీపీలో ఒక్క శామ్‌సంగ్ కంపెనీదే 17 శాతం ఉందంటే కంపెనీ సత్తా ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కంపెనీలో నియామకాల కోసం లక్షలాదిమంది ఎదురు చూస్తుంటారు. తాజా రిక్రూట్‌మెంట్ కోసం కాలేజీ ఫ్రెషర్లు భారీగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Engineering, JOBS, Private Jobs, Samsung

తదుపరి వార్తలు