• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • SAMAGRA SHIKSHA RECRUITMENT 2019 SAMAGRA SHIKSHA TELANGANA NOTIFICATION FOR 704 POSTS KNOW FULL DETAILS SS

Telangana Jobs: గుడ్ న్యూస్... 'సమగ్ర శిక్ష' స్కీమ్‌లో 704 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

Telangana Jobs: గుడ్ న్యూస్... 'సమగ్ర శిక్ష' స్కీమ్‌లో 704 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

Telangana Jobs: గుడ్ న్యూస్... 'సమగ్ర శిక్ష' స్కీమ్‌లో 704 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

Samagra Shiksha Recruitment 2019 | ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ లాంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో ఉంటుంది.

  • Share this:
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.  సమగ్ర శిక్ష స్కీమ్‌లో 704 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నవంబర్ 26 వరకు పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌లో మొత్తం 704 ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, సిస్టమ్ ఎనలిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. సమగ్ర శిక్ష అధికారిక వెబ్‌సైట్‌లో https://samagrashiksha.telangana.gov.in/ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు మొదట 2019 నవంబర్ 23 చివరి తేదీగా ప్రకటించారు. ఇప్పుడు దరఖాస్తు గడువును నవంబర్ 26 వరకు పొడిగించారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ లాంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో ఉంటుంది.

    Samagra Shiksha Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 704
    ఎంఐఎస్ కోఆర్డినేటర్- 144
    సిస్టమ్ అనలిస్ట్- 12
    అసిస్టెంట్ ప్రోగ్రామర్- 27
    ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్- 383
    డేటా ఎంట్రీ ఆపరేటర్- 138

    Samagra Shiksha Recruitment 2019: విద్యార్హతల వివరాలివే...


    ఎంఐఎస్ కోఆర్డినేటర్- బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ (ఎంపీసీ) పాస్ కావడంతో పాటు పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉండాలి. లేదా బీసీఏతో పాటు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.
    డేటా ఎంట్రీ ఆపరేటర్- ఏదైనా డిగ్రీతో పాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్.
    సిస్టమ్ అనలిస్ట్- బీకామ్ / ఎంకామ్‌ / ఎంబీఏ (ఫైనాన్స్) అర్హతతోపాటు ట్యాలీ 9 ఈఆర్‌పీ అకౌంటింగ్ ప్యాకేజీ తెలిసుండాలి.
    అసిస్టెంట్ ప్రోగ్రామర్- ఎంసీఏ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ (కంప్యూటర్స్) పాస్ కావడంతో పాటు ఒరాకిల్ తెలిసుండాలి.
    ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్- ఇంటర్మీడియట్‌తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్).

    Samagra Shiksha Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 20
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 26
    హాల్ టికెట్ల డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 2వ వారం
    ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 డిసెంబర్ 2వ వారం
    వయస్సు- 2019 జూలై 1 నాటికి 34 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- రూ.600

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    AP Anganwadi Jobs: మహిళలకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్‌లో 489 అంగన్వాడీ వర్కర్, హెల్పర్ జాబ్స్

    Indian Navy Jobs: టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో 400 జాబ్స్... రేపటి నుంచి దరఖాస్తులు

    AP Jobs: ఏపీలో కొత్త జాబ్స్... 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా...
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు