హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక శాశ్వతంగా ఇంటి నుంచే పని చేేసే ఛాన్స్.. వివరాలివే

ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక శాశ్వతంగా ఇంటి నుంచే పని చేేసే ఛాన్స్.. వివరాలివే

ప్రముఖ క్లౌడ్​ ఆధారిత సాఫ్ట్​వేర్​ సంస్థ సేల్స్​ ఫోర్స్(Salesforce)​ తన ఉద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. కొత్త పని విధానానికి శ్రీకారం చుట్టింది. ‘‘వర్క్​ ఫ్రం ఎనీ వేర్” అనే నూతన విధానాన్ని​ అందుబాటులోకి తెస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇంకా చదవండి ...

    ప్రముఖ క్లౌడ్​ ఆధారిత సాఫ్ట్​వేర్​ సంస్థ సేల్స్​ ఫోర్స్​ తన ఉద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. కొత్త పని విధానానికి శ్రీకారం చుట్టింది. ‘‘వర్క్​ ఫ్రం ఎనీ వేర్” అనే నూతన విధానాన్ని​ అందుబాటులోకి తెస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని కింద ఉద్యోగులు మూడు మార్గాల్లో పని చేయడానికి వెసులుబాటు కల్పించింది. ఉద్యోగులు ఫ్లెక్స్, ఫుల్లీ రిమోట్, కార్యాలయ ఆధారిత పని విధానం అనే మూడు ఆప్షన్లలో దేన్నైనా ఎంచుకోవచ్చని తెలిపింది. తమ ఉద్యోగుల సంక్షేమ సర్వేల ఆధారంగా కొత్త పని మార్గాలను అందించాలని నిర్ణయించినట్లు​ సంస్థ స్పష్టం చేసింది. ఫ్లెక్స్ ఆప్షన్​ కింద పనిచేసే ఉద్యోగులు టీమ్​ కొలాబరేషన్​, కస్టమర్ మీటింగ్స్​, ప్రెజెంటేషన్స్​ వంటి వాటి కోసం ప్రతి వారం ఒకటి నుండి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి ఫ్లెక్స్ షెడ్యూల్ ఉంటుందని సేల్స్​ఫోర్స్ తెలిపింది. ఇతర ఉద్యోగులు పూర్తిగా రిమోట్​గానే పని చేస్తారని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్​ను ఎంచుకున్న ఉద్యోగులు భౌతికంగా ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది.

    ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన మొత్తం ఉద్యోగుల్లో 49,000 మంది మాత్రమే వారంలో నాలుగైదు రోజులు ఆఫీసులో పనిచేస్తారని తెలిపింది. ఇకపై సేల్స్​ఫోర్స్​లో 9 నుండి 5 జాబ్​కు స్వస్తి పలకనున్నట్లు, ఉద్యోగులు తమకు అనువైన విధానంలో, అనువైన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సేల్స్​ఫోర్స్ చీఫ్​ ప్రెసిడెంట్​ బ్రెంట్ హైదర్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. ఈ కొత్త ఆప్షన్లు సంస్థలో సమానత్వం, వైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని సేల్స్​ఫోర్స్ ఆశిస్తోంది. శాన్​ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ వంటి నగరాల్లో ఉన్న ఆఫీసుల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపింది.

    సేల్స్​ఫోర్స్​కు ఉత్తర అమెరికాలో మొత్తం 19 కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో శాన్​ఫ్రాన్సిస్కోలో ఇటీవల పూర్తయిన సేల్స్​ఫోర్స్​ టవర్ ఒకటి. మొత్తం 1,070 అడుగుల ఎత్తైన ఈ టవర్​ను నిర్మించటానికి 1.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది కంపెనీ. ఈ ఆఫీసులో డెస్క్‌ల వరుసలకు బదులుగా బ్రేక్‌అవుట్ ప్రదేశాలతో "కమ్యూనిటీ హబ్‌లు" లను రూపకల్పన చేస్తుంది.

    మూడు మార్గాల్లో పనిచేసుకునే వెసులుబాటు..

    అయితే, ఆఫీసు నుంచి కార్యకలాపాలు ఎప్పుడు మొదలవుతాయనే విషయంపై కంపెనీ ఎటువంటి స్పష్టతనివ్వలేదు.  కానీ COVID-19 వ్యాప్తిని అరికట్టడంలో అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా ఆఫీసు బిల్డింగ్​లోకి ప్రవేశించే ముందు టెంపరేచర్​ స్క్రీనింగ్‌లు, ఫేస్ కవరింగ్‌, డీప్ క్లీనింగ్, మాన్యువల్ కాంటాక్ట్ ట్రేసింగ్, ఉద్యోగుల వెల్నెస్ డిక్లరేషన్ వంటి నిబంధనలను సంస్థ అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

    కాగా, సేల్స్​ఫోర్స్​ కంపెనీ మొదట్లో తమ ఉద్యోగులు 2021 ఆగస్టు వరకు ‘వర్క్​ ఫ్రం హోం’ విధానంలో పనిచేయవచ్చని తెలిపింది. కానీ, అనేక ఇతర టెక్ కంపెనీలు ఆఫీసుల్లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తుండటం, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్​ పంపిణీ వేగవంతం కావడం వంటి కారణాలతో​ ఆఫీసు నుంచి తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని సేల్స్​ఫోర్స్​ యోచిస్తోంది.

    First published:

    Tags: Corona, Work From Home

    ఉత్తమ కథలు