నైపుణ్యం ఉన్న ఉద్యోగుల(Employees) కోసం కంపెనీలు(Companies) రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. లక్షల జీతాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇందుకు ఉదాహరణే ఇటీవల విడుదలైన స్కేలర్(Scaler) ‘ప్లేస్మెంట్ అసెస్మెంట్ రిపోర్ట్’. గత మూడేళ్లలో నైపుణ్యం సాధించిన తరువాత (upskilling) నిపుణుల జీతాలు 126 శాతం పెరిగాయని అందులో పేర్కొంది. 2,087 మంది గ్రాడ్యుయేట్లపై సర్వే(survey) చేయగా.. వారి సగటు జీతం (average salary)సంవత్సరానికి రూ. 21.6లక్షలు, మధ్యస్థ జీతం 17.5 LPA ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక ప్లేస్మెంట్ రేటు 93.5 శాతంగా ఉంది. ఈ పరిశీలన ప్రకారం దేశీయ వేతనం రూ.3.03 కోట్లుగా ఉంది. 6 నుంచి10 సంవత్సరాల పని అనుభవం ఉన్న ఉద్యోగుల సగటు జీతం రూ.31.9 LPA.
UGC NET 2022: యూజీసీ నెట్ 2022 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల్లో మార్పులు.. వివరాలు
అనుభవం కారణం..
అయితే 10 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వారు సగటున రూ. 57.1 LPA ప్యాకేజీలను అందుకున్నట్లు సర్వేలో వెల్లడైంది. భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అద్భుతమైన కెరీర్ వృద్ధిని సాధిస్తున్నారని, అప్‌స్కిల్లింగ్ కోర్సులను చేపట్టిన తర్వాత మెరుగైన ఉపాధి అవకాశాలను పొందుతున్నారని KPMG-స్కేలర్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది.
జీతాల్లో సగటు పెంపు 67.8 శాతం..
కొత్త కంపెనీలో చేరిన తర్వాత పొందిన జీతాల్లో సగటు పెంపు 67.8 శాతంగా ఉందని, 31.8 శాతం పూర్వ విద్యార్థులు వారు చేరిన ఉద్యోగంలో పదోన్నతి పొందారని స్కేలర్ కమిషన్ నివేదిక వెల్లడించింది. అప్‌స్కిల్లింగ్ కారణంగా ప్రభావితమైన పరిశ్రమలను కూడా ఈ నివేదిక హైలైట్ చేసింది.14.1 శాతం నిపుణులతో సాంకేతిక పరిష్కారాలు, 13.9 శాతంతో ఆర్థిక సాంకేతికతలు, 13.7 శాతంతో ఇ-కామర్స్ & రిటైల్, 8.2 శాతం మంది నిపుణులతో వినియోగదారుల సాంకేతికత పరిశ్రమ ప్రభావితమైనట్లు నివేదిక స్పష్టం చేసింది.
నైపుణ్యం ఉన్న నిపుణుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 25 సంస్థలు ఆసక్తి కనబర్చుతున్నాయి. ఇందులో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఢిల్లీవేరీ ప్రధానమైనవి.
Common Law Admissions Test: 'క్లాట్'లో ఉత్తమ స్కోర్ సాధించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
స్కేలర్ - ఇంటర్వ్యూబిట్ సహ వ్యవస్థాపకుడు అభిమన్యు సక్సేనా మాట్లాడుతూ..‘‘ ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్న అంతరాన్ని ఎడ్టెక్ ప్లేయర్లు గుర్తించడంతో ప్రస్తుతం ఆఫర్లో ఉన్న టెక్ అప్‌స్కిల్లింగ్ ఉద్యోగులకు మరో జీవితాన్ని చూపిస్తుంది. ఉత్పత్తి ఆధారిత కంపెనీలలో పని చేయాలనుకునే భారతీయ టెక్కీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం మా స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లు కేవలం ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలం పాటు కొనసాగడం వల్ల సాంకేతిక సంస్థల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.
మేము టెక్ ఉద్యోగుల( tech employees) అవసరాలను అర్థం చేసుకునే నైపుణ్యం కలిగిన పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా రూపొందించాం. అదేవిధంగా అభ్యర్థులు వారి ఉద్యోగాలను కొనసాగించడంతోపాటు పార్ట్‌టైమ్‌గా చేపట్టగలిగే ప్రోగ్రామ్‌లను రూపొందించాం. ఈ పరిశ్రమలో పెద్ద పెద్ద కలలు కనే ఇంజనీర్లకు అత్యంత సాధికారత కలిగించే సాధనాల్లో స్కేలర్ ఒకటి." అని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.