Home /News /jobs /

SALARY CHECK 6 HIGHEST PAYING TECH JOBS IN INDIA GH VB

Highest Paying Jobs: భారత్​లో అత్యధిక జీతాలు వచ్చే ఉద్యోగాలివే.. లిస్ట్‌లో మీ ఉద్యోగం ఉందేమో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజురోజుకు వేగంగా అభివృద్ధి(Development) చెందుతున్న సాంకేతికతతో ఐటీ రంగం (IT sector) సరికొత్త కెరీర్ అవకాశాలను కల్పించింది. స్కిల్స్(Skills) పెంచుకుంటే ఈ ఫీల్డ్​లో అత్యధిక జీతాలనూ పొందొచ్చు. మంచి ఉద్యోగం, దానికితగ్గట్టే లగ్జరీ లైఫ్​ను సొంతం చేసుకునేందుకు చాలామంది ఔత్సాహికులు ఈ రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు.

ఇంకా చదవండి ...
రోజురోజుకు వేగంగా అభివృద్ధి(Development) చెందుతున్న సాంకేతికతతో ఐటీ రంగం (IT sector) సరికొత్త కెరీర్ అవకాశాలను కల్పించింది. స్కిల్స్(Skills) పెంచుకుంటే ఈ ఫీల్డ్​లో అత్యధిక జీతాలనూ పొందొచ్చు. మంచి ఉద్యోగం, దానికితగ్గట్టే లగ్జరీ లైఫ్​ను సొంతం చేసుకునేందుకు చాలామంది ఔత్సాహికులు ఈ రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. యువతలో సాఫ్ట్​వేర్ కొలువుపై(career in software industry) క్రేజ్​ ఉంది. ఈ రంగంలో అత్యధిక జీతాలనిచ్చే టాప్ ప్రొఫెషనల్ కోర్సుల గురించి మీరూ చదివేయండి మరి..

Jobs In Wipro: BCA, BSc గ్రాడ్యుయేట్లకు విప్రో గుడ్​న్యూస్​.. నెలకు రూ.23 వేల వేతనంతో ఉద్యోగాలు..


1. డేటా సైంటిస్ట్
కంప్యూటర్ సైన్స్(computer engineer), స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్​ వంటి సబ్జెక్ట్​లపై పట్టున్న వారు డేటా సైంటిస్ట్ రంగం వైపు అడుగులు వేయొచ్చు. డేటా విశ్లేషణతో పాటు క్లయింట్స్​ ఫైనాన్షియల్ రికార్డులు, అమ్మకాలు, కంపెనీ గ్రోత్ వంటి కీలక డేటాను సేకరించడం వీరి ప్రధాన విధి. ప్రస్తుతం ఈ జాబ్​ అత్యధిక వేతనాలిచ్చే జాబితాలో టాప్​లో ఉందని చెప్పవచ్చు.

2. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామింగ్​లో కీలక పాత్ర పోషించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(software engineer)​.. సృజనాత్మకత ఆధారంగా విధులు నిర్వహిస్తుంటాడు. క్రియేటివ్​గా ఆలోచిస్తూ.. కొత్త సాఫ్ట్‌వేర్‌లకు రూపకల్పన చేసే ఈ ఉద్యోగంలో సైతం భారీ వేతనాలు అందుకోవచ్చు.

Working Professional: వర్కింగ్​ ప్రొఫెషనల్స్​కు గుడ్​న్యూస్.. 8 నెలల సమయంలోనే ..


3. బ్లాక్‌చెయిన్ డెవలపర్
నేటి కంప్యూటర్​ యుగంలో తరచుగా వినిపిస్తున్న పేరు బ్లాక్​చెయిన్​ టెక్నాలజీ (block chain technology). అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ కోర్సుకు భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో సరిపడినంత మంది నిపుణులు అందుబాటులో లేరు. అందువల్ల ఈ ఉద్యోగార్థులకు భారీ వేతనాలు అందుబాటులో ఉన్నాయి.

4. పైథాన్ ప్రోగ్రామర్
కెరీర్​ పరంగా ఎంతో స్టేబుల్​గా ఉండే ఉద్యోగాల్లో పైథాన్ ప్రోగ్రామర్(python language) ఒకటని చెప్పవచ్చు. సాఫ్ట్​వేర్​ ఇండస్ట్రీలో ఐదంకెల జీతం అందుకోవాలనుకునే వారు మొదటగా పైథాన్​ను నేర్చుకుంటారంటే అతిశయోక్తి కాదు. గత 20ఏళ్లలో తొలిసారి 2021 అక్టోబర్​లో అత్యంత ఆదరణ పొందిన ప్రోగ్రామింగ్ భాషగా Java, JavaScriptలను పైథాన్ అధిగమించింది.

5. క్లౌడ్ ఇంజనీర్
క్లౌడ్‌ కంప్యూటింగ్ ఆధారంగానే జరుగుతున్న డిజిటల్ సేవల రంగం యువతకు భారీ అవకాశాలను అందిస్తోంది. క్లౌడ్ ఇంజనీర్‌ అందించే సేవల ద్వారా సాంకేతిక ప్రక్రియల నిర్వహణ సులువు అవుతుంది. పైథాన్, PHP, .NET, SQL, నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, వర్చువల్ నెట్‌వర్క్‌లపై మంచి పట్టున్న క్లౌడ్​ ఇంజనీర్‌​లకు భారీ ప్యాకేజీలను ఆఫర్​ చేస్తున్నాయి సంస్థలు.

6. డెవలప్​మెంట్(DevOps) ఇంజనీర్‌
సాఫ్ట్​వేర్ ఆపరేషన్స్ టీమ్, డెవలప్‌మెంట్ టీమ్‌తో కలిసి పని చేసే DevOps ఇంజనీర్‌.. Git, Jenkins, Linux, Unix వంటి భాషల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. అలాగే పైథాన్, రూబీ వంటి ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కోడింగ్, స్క్రిప్టింగ్ రాయాల్సి ఉంటుంది. సాఫ్ట్​వేర్ కంపెనీలు వీరికీ మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IT jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు