Home /News /jobs /

SALARIES IN INDIA ARE EXPECTED TO RISE BY AN AVERAGE OF 6 4 PERCENT IN 2021 NS

Salary Hike పై మీకు భారీ ఆశలు ఉన్నాయా? అయితే ఈ సర్వే రిపోర్ట్ చదవండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా ప్రభావం తగ్గడంతో పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఓ నివేదిక వేతన జీవుల్లో ఆశలు మరింత పెంచింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    కరోనా ఈ ఏడాది అన్ని రంగాల ఉద్యోగులను కష్టాల్లోకి నెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులతో సాహా అనేక మంది వేతనాల్లో కోతలు పడ్డాయి. ఇంకా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే కరోనా ప్రభావం తగ్గడంతో పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఓ నివేదిక వేతన జీవుల్లో ఆశలు మరింత పెంచింది. ఈ 2021లో భారత దేశంలో సరాసరి 6.4 శాతం వేతనాలు పెరగవచ్చని విల్స్ టవర్స్ వాట్సాన్(Willis Towers Watson's)కు చెందిన తాజా సాలరీ బడ్జెట్ ప్లానింగ్ సర్వే రిపోర్ట్ వెల్లడించింది. ఇండోనేషియాలో 6.5, చైనాలో 6, ఫిలిప్పిన్స్ 5, సింగపూర్ లో 3.5, హంగ్ కాంగ్ లో 3 శాతం వేతనాలు పెరగనున్నట్లు నివేదిక తేల్చింది.

    టెక్నాలజీ, ఫార్మా, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ & రీటైల్ ప్రాజెక్టుల్లో పని చేశావరి వేతనాలు 8 శాతం వరకు పెరగవచ్చని అధ్యాయనం తేల్చింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, మానిఫాక్చరింగ్ సెక్టార్ లో పని చేసే వారి వేతనాలు 7 శాతం, బీపీఓ సెక్టార్ లో పని చేసే వారి వేతనం 6 శాతం, ఎనర్జీ సెక్టార్ లో పని చేసే వారి వేతనం అత్యల్పంగా 4.6 శాతం పెరగొచ్చని సర్వే తెలిపింది.

    భారతదేశంలోని అనేక కంపెనీల ఆదాయం ఈ ఏడాదిలో 37% పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే అంచానా వేసింది. 2020 ఏడాది మూడో త్రైమార్షికంలో ఈ అంచనా 18%గా ఉంది. అయితే.. భారతదేశంలోని కేవలం 10% సంస్థలు మాత్రమే కొత్త నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు అధ్యాయనంలో తేలింది. గత త్రైమాసికంలో ఈ లెక్క 14 శాతంగా ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Govt Jobs 2021, India, IT Employees, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు