Andhra Pradesh: ఆ పరీక్ష పాసైతేనే సచివాలయ ఉద్యోగాలు పర్మినెంట్.. ఉద్యోగాలు ఎక్కడికి పోవు.. సజ్జల భరోసా..

సజ్జల రామకృష్ణారెడ్డి(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే గ్రామ, వార్డు సచివాలయాల తొలి బ్యాచ్‌ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీకి రెండేళ్ల సర్వీసు పూర్తి కాబోతుంది. ఇందుకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే నిబంధనల ప్రకారం వారందరికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి పే స్కేలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ముందు వారికి శాఖ పరంగా క్రెడిట్‌ బేస్‌ అసెస్‌మెంట్‌ పరీక్షను సెప్టెంబర్‌ 11 – 17 తేదీల మధ్య ఒక రోజు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహించబోయే పరీక్షపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.

    సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రొబేషన్‌ కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరూ ఉద్యోగులకు ఇలాంటి విధానమే ఉందని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో నియమితులైన వారిలో ఎవరి ఉద్యోగాలు ఎక్కడికీ పోవని హామీ ఇచ్చారు. ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకే పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్‌ను పొడిగించనున్నట్టు తెలిపారు.

    పరీక్ష పాసైన వారి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ పరీక్ష తప్ప మరో పరీక్ష ఉండందన్నారు. డిపార్ట్‌మెంట్ టెస్టులు ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఇక, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు 90 నిమిషాల్లో వంద ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: