సైనిక్ స్కూల్ చంద్రాపూర్ (Sainik School, Chandrapur) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. TGT, PGT తో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సైనిక్ స్కూల్ చంద్రాపూర్ అధికారిక వెబ్ సైట్ sainikschoolchandrapur.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు..
TGT హిందీ | 1 |
PGT ఇంగ్లిష్ | 1 |
PGT ఫిజిక్స్ | 1 |
PGT కెమిస్ట్రీ | 1 |
PGT మాథ్స్ | 1 |
PGT బయోలజీ 1 | 1 |
PGT కంప్యూటర్ సైన్స్ | 1 |
ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ | 1 |
ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ | 1 |
ల్యాబ్ అసిస్టెంట్ బయోలజీ | 1 |
అర్హతల వివరాలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ చసిన అభ్యర్థులు TGT, PGT చేసిన అభ్యర్థులు ఆయా ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పస్టం చేశారు. ఇంటర్ చేసిన అభ్యర్థులు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వేతనాల వివరాలు: TGT హిందీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 వేతనం చెల్లించనున్నారు. PGT ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.47,600, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 చెల్లించనున్నారు. ఇంకా ఉచితంగా వసతి సదుపాయం, ఇద్దరు పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తారు.
Jobs in Telangana: డిగ్రీ అర్హతతో తెలంగాణలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు వారం రోజులే చాన్స్!
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://www.sainikschoolchandrapur.com ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హెం పేజీలో కనిపించే STAFF RECRUITMENT NOTIFICATION (PGT) DATED 05-FEB-2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం 6 దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. కావాల్సిన వివరాలను Step 5: నమోదు చేసుకుని అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Job notification, Private teachers