సైనిక్ స్కూల్, చిత్తోర్‌ఘర్ (Sainik School, Chittorgarh) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. TGTతో పాటు ఇతర ఖాళీలను(Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్ sschittorgarh.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
S.No | పోస్టు | ఖాళీలు |
1 | టీజీటీ | 2 |
2 | జనరల్ ఎంప్లాయిస్ | 17 |
3 | PEM/PTI-Cum-Matron | 1 |
మొత్తం: | 20 |
విద్యార్హతల వివరాలు:
టీజీటీ: ఈ పోస్టులు మాథ్స్ సబ్జెక్టుకు సంబంధించి ఒకటి, సైన్స్ కు సంబంధించి ఒకటి ఉందని ప్రకటనల పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యుర్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంకా బీఈడీ చేసి ఉండాలి. ఇంకా CTET క్వాలిఫై అయి ఉండాలి. ఇంగ్లిష్ మీడియం పబ్లిక్ స్కూల్ లో ఐదేళ్ల పాటు టీచింగ్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ లో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.44,900 వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
IIT Jobs : ఐఐటీలో 95 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే అవకాశం
జనరల్ ఎంప్లాయిస్(General Employees): స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనుల్లో ఐదేళ్ల విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ పోస్టులు మొత్తం 17 ఖాళీలను భర్తీ చేస్తుండగా కాంట్రాక్ట్ విధానంలో 14, రెగ్యులర్ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేలు, కాంట్రాక్ట్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించను్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్
ఎంపిక విధానం:
1.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదటగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
2.అనంతరం వారికి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డెమో నిర్వహిస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలను స్కూల్ వెబ్ సైట్లో ప్రదర్శిస్తారు.
అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా అప్లై చేయాలంటే..
-ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-అప్లికేషన్ ఫామ్ (Job Application Form) ను ఈ లింక్ ద్వారా నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
-అనంతరం వివరాలను నింపి స్కూల్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
-అప్లై చేసుకునే సమయంలో రూ.500 డీడీని జత చేయాల్సి ఉంటుంది.
-ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Job notification, JOBS, School