హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Sainik School Admissions 2021: నాణ్య‌మైన విద్య‌కు చిరునామా.. సైనిక్‌స్కూల్స్‌ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, ప‌రీక్ష‌ విధానం

Sainik School Admissions 2021: నాణ్య‌మైన విద్య‌కు చిరునామా.. సైనిక్‌స్కూల్స్‌ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, ప‌రీక్ష‌ విధానం

ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైన వేరియెంట్ అని వైద్య నిపుణులతో పాటు డబ్ల్యూహెచ్‌వో కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు కూడా స్కూళ్ల మూసివేతపై దృష్టిసారించాయి.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైన వేరియెంట్ అని వైద్య నిపుణులతో పాటు డబ్ల్యూహెచ్‌వో కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు కూడా స్కూళ్ల మూసివేతపై దృష్టిసారించాయి. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

నాణ్య‌మైన విద్యాకు చిరునామా సైనిక్ స్కూల్స్‌. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 27, 2021 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ప్ర‌వేశ ప‌రీక్ష (Entrance Test) జ‌న‌వ‌రి 9, 2022న నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సంద‌ర్శించండి.

ముఖ్య స‌మాచారం ..

ద‌ర‌ఖాస్తు ప్రారంభంసెప్టెంబ‌ర్ 27, 2021
ద‌ర‌ఖాస్త‌కు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 26, 2021
స‌వ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశంఅక్టోబ‌ర్ 28, 2021 నుంచి న‌వంబ‌ర్ 2, 2021
ప‌రీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.400
ప‌రీక్ష తేదీజ‌న‌వ‌రి 9, 2022
ప‌రీక్ష స‌మ‌యం ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 150 నిమిషాలు,                                       తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 180 నిమిషాలు
అధికారిక వెబ్‌సైట్https://aissee.nta.nic.in/      www.nta.ac.in


అర్హ‌త‌లు..

ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వ‌య‌సు 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు అర్హులు.

ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్503150
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌25250
మొత్తం125300


SSC Recruitment 2021: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 3,261 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల


తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్504200
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
 జ‌న‌ర‌ల్ సైన్స్‌25250
సోష‌ల్ సైన్స్‌25250
మొత్తం150500


NEET 2021 : త్వ‌ర‌లో నీట్ 2021 ఫ‌లితాలు.. దేశంలో టాప్ మెడిక‌ల్ కాలేజీల లిస్ట్‌


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

Step 2 : ముందుగా అధికారిక‌ వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సంద‌ర్శించాలి.

Step 3 : అనంత‌రం అధికారిక బ్రౌచ‌ర్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 : అప్లికేష‌న్ ఫాంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ స‌రిగా ఇవ్వాలి.

Step 5 : జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.

Step 6 : విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌, క్యాస్ట్ స‌ర్టిఫికెట్ సంబంధిత స‌ర్టిఫికెట్ల‌ను సాఫ్ట్ కాపీ రూపంలో అప్లోడ్ చేయాలి.

First published:

Tags: Application, Exams, NOTIFICATION, Schools

ఉత్తమ కథలు