Home /News /jobs /

SAIL RECRUITMENT 2022 STEEL AUTHORITY OF INDIA LIMITED RELEASED JOB NOTIFICATION FOR 200 TRAINEE POSTS KNOW HOW TO APPLY SS

SAIL Recruitment 2022: సెయిల్‌లో 200 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

SAIL Recruitment 2022: సెయిల్‌లో 200 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

SAIL Recruitment 2022: సెయిల్‌లో 200 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

SAIL Recruitment 2022 | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 200 ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌లో ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 200 ట్రైనీ పోస్టులు ఉన్నాయి. రౌర్కెలాలోని ఇస్పత్ జనరల్ హాస్పిటల్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏడాది కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెయిల్. ఈ పోస్టులకు 2022 ఆగస్ట్ 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 ఆగస్ట్ 20 చివరి తేదీ. గతంలో సెయిల్‌లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నవారు అప్లై చేయడానికి అర్హులు కాదు. సెయిల్‌లో ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

SAIL Recruitment 2022: ఖాళీల వివరాలివే...







































































 మొత్తం ఖాళీలు 200 విద్యార్హతలు వేతనం
 మెడికల్ అటెండెంట్ శిక్షణ 100 టెన్త్ లేదా తత్సమాన అర్హత రూ.7,000
 క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్ 20 డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ రూ.17,000
 అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ (ASNT) 40 డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ రూ.15,000
 డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనింగ్ 6 ఇంటర్మీడియట్‌తో పాటు పీజీడీసీఏ రూ.9,000
 మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ శిక్షణ 10 డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ రూ.9,000
 హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ 10 ఎంబీఏ, బీబీఏ, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ రూ.15,000
 ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనింగ్ 5 ఇంటర్మీడియట్‌తో పాటు హాస్పిటల్ అటెండెంట్ లేదా అనస్థీషియా అటెండెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి రూ.9,000
 రేడియోగ్రాఫర్ శిక్షణ 3 డిప్లొమా ఇన్ మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ రూ.10,000
 ఫార్మసిస్ట్ శిక్షణ 3 డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీఫార్మసీ రూ.9,000
 అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ శిక్షణ 3 బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ రూ.9,000

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే


SAIL Recruitment 2022: అప్లై చేయండి ఇలా


Step 1- ముందుగా http://igh.sailrsp.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- Apply for Trainee నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- Online Application Form పైన క్లిక్ చేయాలి.

Step 4- అభ్యర్థి తన వివరాలన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

Step 5- అప్లికేషన్ ఫామ్, డిక్లరేషన్ ఫామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

Step 6- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Central Government Jobs, Job notification, JOBS, SAIL

తదుపరి వార్తలు