హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SAIL: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కన్సల్టెంట్స్ జాబ్స్‌కి సెయిల్‌ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు ఇలా..

SAIL: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కన్సల్టెంట్స్ జాబ్స్‌కి సెయిల్‌ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు ఇలా..

SAIL Recruitment

SAIL Recruitment

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) గుడ్‌న్యూస్‌ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెయిల్‌ వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

SAIL: ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) గుడ్‌న్యూస్‌ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెయిల్‌ వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెయిల్ అధికారిక వెబ్‌సైట్ sailcareers.com ద్వారా డిసెంబర్ 17 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా సెయిల్ మొత్తంగా 259 కన్సల్టెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఖాళీల వివరాలు

సీనియర్ కన్సల్టెంట్- 2 పోస్టులు, కన్సల్టెంట్/ సీనియర్ మెడికల్ ఆఫీసర్- 8 పోస్టులు, మేనేజర్- 6 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్- 22 పోస్టులు, మెడికల్ ఆఫీసర్- 5 పోస్టులు, డిప్యూటీ మేనేజర్- 2 పోస్టులు, S3/S1 గ్రేడ్స్- 128 పోస్ట్‌లు, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- 54 పోస్టులు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- 24 పోస్టులను భర్తీ చేయనుంది.

 అర్హత ప్రమాణాలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

సీనియర్ కన్సల్టెంట్ (E4 గ్రేడ్): ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా / నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ / నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుంచి DM/ DNB/ Mch చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ (E1 గ్రేడ్): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు MBBS పూర్తిచేసి ఉండాలి. అంతేకాకుండా కనీసం ఒక సంవత్సరం పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్ పీరియన్స్ (ఇంటర్న్‌షిప్ తర్వాత) తప్పనిసరి. మేనేజర్ (E3 గ్రేడ్): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే బీఈ/బీటెక్ పూర్తిచేసి ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో కనీసం ఏడు సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ఇతర పోస్టులకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేర్వేరుగా ఉన్నాయి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.

కన్సల్టెంట్ (E3 గ్రేడ్)/ సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E2 గ్రేడ్): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పీజీ డిగ్రీ/ DNB పూర్తి చేసి ఉండాలి. కన్సల్టెంట్ పోస్ట్ కోసం కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇక, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం ఒక ఏడాది పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.

దరఖాస్తు విధానం

ముందుగా సెయిల్ అధికారిక పోర్టల్ sailcareers.comను సందర్శించాలి. ఆ తరువాత హోమ్ పేజీలో Careers ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన అన్ని వివరాలతో అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫీజు‌ను చెల్లించి, దరఖాస్తును సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. చివరగా భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులు E1, అంతకంటే పై పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకుంటే రూ.700 ఫీజుగా చెల్లించాలి. S3 పోస్టులకు రూ. 500, S1 పోస్ట్‌లకు రూ. 300 ఫీజుగా చెల్లించాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం డిపార్ట్‌మెంటల్ కేటగిరీల అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వీరు ప్రాసెసింగ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Hyderabad Investments: హైదరాబాద్ లో మరో ప్రముఖ సంస్థ రూ.6200 కోట్ల పెట్టుబడులు.. 5 వేల మందికి ఉపాధి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం

ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు

రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్‌లో పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు భిలాయ్ స్టీల్ ప్లాంట్, చంద్రపూర్ ఫెర్రో అల్లాయ్ ప్లాంట్ (CFP), సేలం స్టీల్ ప్లాంట్ (SSP)వంటి వాటిల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.90,000- రూ.240,000 మధ్య వేతనం లభిస్తుంది. కన్సల్టెంట్ / మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.80,000- రూ.2,20,000 మధ్య జీతం ఉంటుంది. మెడికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారు రూ.50,000- రూ.1,60,000 మధ్య జీతం లభిస్తుంది.

First published:

Tags: Career and Courses, JOBS, SAIL

ఉత్తమ కథలు