Home /News /jobs /

SAIL RECRUITMENT 2021 STEEL AUTHORITY OF INDIA LIMITED HAS INVITED APPLICATIONS FOR THE MEDICAL OFFICER AND MEDICAL SPECIALIST POSTS NS

SAIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఇటీవల ప్రముఖ ప్రముఖ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఆగిన ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకోవడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్లలో మునిగిపోయారు. తాాజాగా నిరుద్యోగులకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్ కేటగిరీల్లో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది.

    ఖాళీలు, అర్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేస్తుండగా మెడికల్ ఆఫీసర్ కేటగిరీలో 26, మెడికల్ స్పెషలిస్ట్ కేటగిరీలో మరో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
    మెడికల్ ఆఫీసర్: బీడీఎస్/ఎంబీబీఎస్ చేసి ఏడాది అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. 34 ఏళ్ల వయస్సు కలిగిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో స్పస్టం చేశారు.
    Medical Specialist: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ నుంచి PG Degree/DNB చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి. వయోపరిమితిని 41 ఏళ్లుగా నిర్ణయించారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Application&Notification-Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7లోగా సూచించిన ఫార్మాట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని నింపాల్సి ఉంటుంది. నింపిన ఆ ఫామ్ ను DGM[Pers], Raw Materials Division, Steel Authority of India Ltd., 6th Floor, Industry House Building, 10 Camac Street, Kolkata - 700017[West Bengal] పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS, Kolkata, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు