కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో దేశంలో నియామకాలు జోరందుకున్నాయి. ప్రముఖ సంస్థలు ఇటీవల వరుసగా నియమాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. అయితే కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. అయితే మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 21 స్పోర్ట్స్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విద్యార్హతల వివరాలు..
SAI, NS NIS లేదా గుర్తింపు పొందిన ఇండియన్/ఫారెన్ యూనివర్సిటీ నుంచి కోచింగ్ లో డిప్లొమో ఉత్తీర్ణత/ఒలింపిక్/ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మెడల్ విజేత/ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే వరకు అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలి.
How To Apply:
-అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి.
-అనంతరం Register New User ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-అనంతరం పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తతదితర వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
-రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
-అప్లై చేసుకున్న అభ్యర్థులను మొదటగా షార్ట్ లిస్ట్ చేస్తారు. SAI వెబ్ సైట్లో ఇంటర్వ్యూకు సంబంధించిన తేదీ, ప్రదేశం తదితర వివరాలను ప్రకటిస్తారు.
AP Govt Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. ఇలా అప్లై చేసుకోండి
Selection Criteria: క్రీడల్లో సాధించిన విజయాలు, అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Job notification, JOBS