హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SAI Recruitment 2022: పది అర్హతతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

SAI Recruitment 2022: పది అర్హతతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

పది అర్హతతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

పది అర్హతతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) మసాజ్ థెరపిస్ట్‌ల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) మసాజ్ థెరపిస్ట్‌ల కోసం నోటిఫికేషన్(Notification) ను విడుదల చేసింది. దీని ద్వారా 104 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులను కోరుతోంది. మసాజ్ థెరపిస్ట్‌ల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులు(Applications) చేసుకోవడానికి ఆగస్టు 6, 2022 లేదా అంతకంటే ముందు ఈ మెయిల్(E Mail) చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Textile Recruitment 2022: 10వ తరగతి అర్హతతో.. టెక్స్‌టైల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్ పోస్టుల భర్తీ..


ప్రారంభ తేదీ: 15 జూలై 2022

దరఖాస్తులకు ముగింపు తేదీ : ఆగస్టు 6, 2022

మొత్తం పోస్టులు : 104

రిజర్వేషన్ల వారీగా అన్ రిజర్వ్ డ్ కేటగిరీలో 44, ఓబీసీ 24, ఎస్సీ 15, ఎస్టీ 7, EWS కేటగిరీ కింద 10 పోస్టులను కేటాయించారు.

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం : నెలకు ఈ మసాజ్ థెరపిస్ట్ పోస్టులకు రూ.35వేలు చెల్లించనున్నారు.

అర్హతలు : 10th , 12th , గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుండి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. అంతే కాకుండా మసాజ్ థెరపిస్టుకు సంబంధించి పని అనుభవంతో పాటు..  సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.

అనుభవం, క్వాలిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిని ఒక్క పోస్టుకు 5గురు చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనిలో హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి అధనంగా మార్కులను కేటాయిస్తారు.

ఉద్యోగ స్థానం : తిరువనంతపురం , కేరళ

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కింద తెలిపిన ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. recruitment.massagetherapist@gmail.com. తగిన ఫార్మాట్ లో మీ దరఖాస్తును మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఒప్పంద ప్రాతిపదికన ఒక సంవత్సరం వరకు ఈ ఉద్యోగం ఉంటుంది. పనితీరు ఆధారంగా గరిష్టంగా 8 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Sports

ఉత్తమ కథలు