RWF Recruitment 2021: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

RWF Recruitment 2021: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

RWF Recruitment 2021 | రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వే మాత్రమే కాదు... రైల్వేకు చెందిన ఇతర సంస్థలు కూడా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంటాయి. బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 192 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://rwf.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫార్మాట్ నోటిఫికేషన్‌లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    DRDO Recruitment 2021: రూ.54,000 వేతనంతో డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Job Mela in Tirupati: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... తిరుపతిలో జాబ్ మేళా

    RWF Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 192
    ఫిట్టర్- 85
    మెషినిస్ట్- 31
    మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8
    టర్నర్- 5
    సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్)- 23
    ఎలక్ట్రీషియన్- 18
    ఎలక్ట్రానిక్ మెకానిక్- 22

    Telangana Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణలో మొత్తం 67,820 ఖాళీలు

    Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ... ఖాళీల వివరాలు ఇవే

    RWF Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 13
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 9
    ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- చివరి తేదీ నుంచి 45 రోజుల్లోగా
    శిక్షణ ప్రారంభం- మెరిట్ లిస్ట్ వచ్చిన 15 రోజుల తర్వాత
    విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
    స్టైపెండ్- ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులకు రూ.12,261. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) పోస్టులకు రూ.10,899.
    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
    ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
    పర్సనల్ డిపార్ట్‌మెంట్,
    రైల్ వీల్ ఫ్యాక్టరీ,
    యెలహంక, బెంగళూరు- 560064.
    Published by:Santhosh Kumar S
    First published: