బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ (Rail Wheel Factory) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 192 అప్రెంటీస్ పోస్టుల్ని (Apprentice Jobs) భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్ వీల్ ఫ్యాక్టరీ. అభ్యర్థులు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తుల్ని నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. రైల్ వీల్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయొచ్చు.
మొత్తం ఖాళీలు | 192 |
ఫిట్టర్ | 85 |
మెషినిస్ట్ | 31 |
మెకానిక్ (మోటార్ వెహికిల్) | 8 |
టర్నర్ | 5 |
సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) | 23 |
ఎలక్ట్రీషియన్ | 18 |
ఎలక్ట్రానిక్ మెకానిక్ | 22 |
IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 282 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 13
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- చివరి తేదీ నుంచి 45 రోజుల్లోగా
శిక్షణ ప్రారంభం- మెరిట్ లిస్ట్ వచ్చిన 15 రోజుల తర్వాత
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
స్టైపెండ్- ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులకు రూ.12,261. సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) పోస్టులకు రూ.10,899.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
South Indian Bank Jobs 2021: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు... రూ.63,840 వేతనం
Step 1- అభ్యర్థులు రైల్ వీల్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్ https://rwf.indianrailways.gov.in/ లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి పూర్తి చేయాలి.
Step 3- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 4- అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ కాపీ రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
Step 5- దరఖాస్తుల్ని రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
పర్సనల్ డిపార్ట్మెంట్,
రైల్ వీల్ ఫ్యాక్టరీ,
యెలహంక, బెంగళూరు- 560064.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railways