Railway Jobs: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

RWF Recruitment 2019 | దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17న ప్రారంభమైంది.

news18-telugu
Updated: November 13, 2019, 3:34 PM IST
Railway Jobs: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: November 13, 2019, 3:34 PM IST
భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందే భారతీయ రైల్వేకు చెందిన మరో సంస్థ రైల్ వీల్ ఫ్యాక్టరీ-RWF ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఫిట్టర్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే వీల్ ఫ్యాక్టరీ. మొత్తం 192 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తుల్ని పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందాల్సిన చివరి తేదీ నవంబర్ 15. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rwf.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రైల్ వీల్ ఫ్యాక్టరీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RWF Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 192

ఫిట్టర్- 85
మెషినిస్ట్- 31
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8


టర్నర్- 5
Loading...
సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్- 23
ఎలక్ట్రీషియన్- 18
ఎలక్ట్రానిక్ మెకానిక్- 22

RWF Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 15
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.
విద్యార్హత- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
స్టైపెండ్- ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్‌లకు నెలకు రూ.10,899, సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్‌కు రూ.12,261.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Senior Personnel Officer, Personnel Department,
Rail Wheel Factory, Yelahanka,
Bangalore -560064.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు



ఇవి కూడా చదవండి:

Railway Jobs: గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో 4103 రైల్వే పోస్టుల భర్తీ... వివరాలివే

ISRO Jobs: నెల్లూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...