హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RV University: డేటాసైన్స్‌లో RV యూనివర్సిటీ స్పెషల్ ఎంటెక్ కోర్సు.. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసమే..

RV University: డేటాసైన్స్‌లో RV యూనివర్సిటీ స్పెషల్ ఎంటెక్ కోర్సు.. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కర్ణాటక కేంద్రంగా పనిచేసే RV యూనివర్సిటీ. ఈ ప్రైవేట్ విద్యాసంస్థ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికోసం డేటాసైన్స్‌లో ఎంటెక్ కోర్సును ప్రారంభించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

RV University : వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కర్ణాటక కేంద్రంగా పనిచేసే RV యూనివర్సిటీ. ఈ ప్రైవేట్ విద్యాసంస్థ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికోసం డేటాసైన్స్‌లో ఎంటెక్ కోర్సును ప్రారంభించింది. ఇందుకు ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రాడ్‌తో (Upgrad) ఒప్పందం చేసుకుంది. డేటా సైన్స్‌లో జాయింట్ M.Tech ప్రోగ్రామ్‌ను రెండు సంస్థలు సంయుక్తంగా అందించనున్నాయి. ఇండస్ట్రీ అవసరాలను తీర్చేలా అభ్యర్థులను సిద్ధం చేయడమే ఈ కోర్సు లక్ష్యమని రెండు సంస్థల ప్రతినిధులు తెలిపారు.

పరిశ్రమకు సంబంధించిన స్పెషలైజేషన్లు, లైవ్ కేస్ స్టడీస్, ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌లు, పరిశ్రమ నిపుణుల మెంటర్‌షిప్, లేటెస్ట్ టూల్స్‌ విశ్లేషణలు.. వంటివన్నీ ఈ కోర్సులో భాగంగా ఉంటాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం డేటా సైన్స్‌లో అందిస్తున్న ఈ కోర్సు 2023 నుంచి అందుబాటులోకి రానుంది. ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ విధానాల్లో అప్‌గ్రాడ్ ద్వారా కోర్సును డెలివర్ చేయనున్నారు.

 అసైన్‌మెంట్స్

రెండేళ్లలో పూర్తిచేగలిగే ఏడు స్పెషలైజేషన్లతో ఈ ఎంటెక్ కోర్సును అందిస్తోంది అప్‌గ్రాడ్. ఫుల్ టైమ్ కోర్సు చేసేవారికి రెండో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్, రిసెర్చ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి సెషన్స్ ఉంటాయి. పార్ట్ టైమ్ అభ్యర్థులకు ఇండస్ట్రీ వర్క్ ఆధారంగా క్రెడిట్స్ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి RV యూనివర్సిటీ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అయితే ఈ జాయింట్ కోర్సులో చేరిన విద్యార్థులకు అప్‌గ్రాడ్ క్యాంపస్ సర్టిఫికేట్ అందిస్తుంది.

Exclusive: సెక్స్‌ ఫర్‌ జాబ్‌ వివాదంతో సస్పెండ్‌ అయిన అండమాన్ చీఫ్ సెక్రటరీ..తాజాగా మరో మహిళ ఫిర్యాదు

ప్రోగ్రామింగ్‌లో అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్‌లో డొమైన్-స్పెసిఫిక్ సబ్జెక్టులు, బిగ్ డేటా అనలిటిక్స్, AI, మెషిన్ లెర్నింగ్, ఇండస్ట్రీ డ్రివెన్ ప్రాజెక్ట్‌లు.. వంటివన్నీ కోర్సులో కవర్ అవుతాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం అభ్యర్థులు కోర్సు మధ్యలో నుంచి ఎగ్జిట్ అయ్యి, PG డిప్లొమా సర్టిఫికెట్ పొందవచ్చు. లేదా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌లో తమ క్రెడిట్స్ సేవ్ చేసుకొని, భవిష్యత్తులో కోర్సు పూర్తిచేయవచ్చు.

 కెరీర్‌కు ప్లస్ పాయింట్

అప్‌గ్రాడ్‌తో కలిసి డేటాసైన్స్‌లో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు ఆర్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్. మూర్తి. తమ సంస్థ ప్రపంచ స్థాయి టెక్ ఇన్‌స్టిట్యూట్‌గా మారేందుకు ఈ ఒప్పందం ఒక ముందడుగని తెలిపారు. మంచి కెరీర్ ఆపర్చునిటీస్ పొందే విద్యార్థులకు తాజా ఎంటెక్ ప్రోగ్రామ్ ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. కోర్సు విషయంలో RV గ్రూప్ తమపై ఉంచిన నమ్మకాని నిలబెడతామని చెప్పారు అప్‌గ్రాడ్ క్యాంపస్ CEO అమిత్ మహేన్‌సారియా. RV యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌తో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ కోర్సుతో అభ్యర్థులు కెరీర్ గ్రోత్‌కు బాటలు వేసుకోవచ్చని అమిత్ వివరించారు.

First published:

Tags: Data science

ఉత్తమ కథలు