విద్యార్థుల ప్రోత్సాహానికి స్కాలర్‌షిప్స్ (Scholarships) ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని వివిధ సంస్థలు స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే RV యూనివర్సిటీ వచ్చే అకడమిక్ ఇయర్ (2023-24)కు సంబంధించి మెరిట్ స్కాలర్‌షిప్స్ కోసం ఏకంగా రూ.10 కోట్లను కేటాయించింది. ఈ స్కాలర్‌షిప్స్ ద్వారా మొత్తం 500 మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ విద్యార్థులు తమ అకడమిక్ లక్ష్యాలను సాధించడానికి వీలుగా ఈ యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్‌ను ప్రదానం చేస్తోంది. యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు చెందిన 200 మంది బీటెక్ స్టూడెంట్స్, 50 మంది బీఎస్సీ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌లను అందుకోనున్నారు.
ఎకనామిక్స్ ప్రోగ్రామ్స్‌కు 80 స్కాలర్‌షిప్స్
స్కూల్ ఆఫ్ లాలో ఐదేళ్ల ఇండిగ్రేటెడ్ B.A.LL.B, B.B.A.LL.B. LL.M ప్రోగ్రామ్స్ సంబంధించి 75 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్ ప్రయోజనం పొందన్నారు. స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్స్, స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ నుంచి దాదాపు 40 మంది విద్యార్థుల చొప్పున స్కాలర్‌షిప్స్ ప్రయోజనం పొందనున్నారు. స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో B.B.A, B.Com, B.A వంటి (ఎకనామిక్స్) ప్రోగ్రామ్స్ చేసే విద్యార్థుల కోసం 80 మెరిట్ స్కాలర్‌షిప్స్ RV యూనివర్సిటీ కేటాయించింది.
ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ ప్రకారం..
ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్స్ మంజూరు చేయనున్నారు. ఈ స్కాలర్‌షిప్ రెన్యూవల్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల అత్యుత్తమ పనితీరుకు లోబడి ఉంటుంది. దేశంలోని అన్ని స్టేట్, సెంట్రల్ బోర్డ్స్, గుర్తింపు పొందిన ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన మెరిట్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ట్యూషన్ ఫీజులను పూర్తిగా లేదా పాక్షికంగా ఈ స్కాలర్‌షిప్స్ కవర్ చేయనున్నాయి. అర్హులైన విద్యార్థులు https://admissions.rvu.edu.in/ అనే లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
మెరిట్ ఆధారంగా రెన్యూవల్..
మొదటి సంవత్సరం స్టడీ కోసం స్కాలర్‌షిప్స్‌లో 100%, 50%, 25% స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. స్కాలర్‌షిప్స్ రెన్యూవల్ కూడా మెరిట్ మెయిన్‌టెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. 2023-2024 అకడమిక్ ఇయర్ కోసం ప్రస్తుతం అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో విద్యార్థులు వచ్చే అకడమిక్ ఇయర్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే అడ్మిషన్స్ స్టార్ట్..
అండర్-గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్, ఫుల్-టైమ్/పార్ట్-టైమ్ Ph.D ప్రోగ్రామ్స్‌కు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ స్కాలర్‌షిప్స్ కోసం RV యూనివర్సిటీకి చెందిన ఆరు స్కూళ్ల నుంచి విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. RV యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లా డిపార్ట్‌మెంట్స్ మొత్తంగా 45+ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Scholarship