హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక ప్రకటన.. దేశవ్యాప్తంగా ఐదు కొత్త యూనివర్సిటీల ఏర్పాటు

RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక ప్రకటన.. దేశవ్యాప్తంగా ఐదు కొత్త యూనివర్సిటీల ఏర్పాటు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RSS: భారతీయ మితవాద, హిందూ జాతీయవాద, స్వచ్ఛంద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కీలక ప్రకటన చేసింది. అన్ని వర్గాల వారికి ఉన్నత విద్యను చేరువ చేసేందుకు కొత్తగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతీయ మితవాద, హిందూ జాతీయవాద, స్వచ్ఛంద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కీలక ప్రకటన చేసింది. అన్ని వర్గాల వారికి ఉన్నత విద్యను చేరువ చేసేందుకు కొత్తగా యూనివర్సిటీ(Universities)లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బెంగళూరు (Bengaluru)లో చాణక్య యూనివర్సిటీని ప్రారంభించిన ఈ సంస్థ.. అసోంలోని గౌహతిలోనూ యూనివర్సిటీ స్థాపనకు సంబంధించిన పనులు చేస్తోంది. కాగా, దేశవ్యాప్తంగా మరో 5 కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా తెలిపింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన విద్యాభారతి (Vidya Bharati) జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ యతీంద్ర శర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యూనివర్సిటీల ఏర్పాటు గురించి ఆయన మాట్లాడారు.

దేశంలో విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి విద్యను అందించడానికి RSS చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. ఇఫ్పుడు ఉన్నత విద్య అందించేందుకు అడుగులు వేస్తోంది. ఉచ్ఛ్ శిక్షా సంస్థాన్ (Uchch Shiksha Sansthan) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంస్థ ఉన్నత విద్యను అందించనుంది. విద్యా రంగంలో సానుకూల మార్పు తీసుకురావడమే కొత్త విశ్వవిద్యాలయాల లక్ష్యమని విద్యాభారతి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ యతీంద్ర శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 5 వర్సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ధ్రువీకరించారు.

* వేలమందికి విద్యా బోధన

RSS నిర్వహించే విద్యాసంస్థలలో ఇప్పటికే 29,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన విద్యార్థులు ఉండటం విశేషం. కాగా, విద్యాభారతి పాఠశాలల్లో సుమారు 50 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తారు. బెంగళూరులోని చాణక్య యూనివర్సిటీలో మొదటి బ్యాచ్ కింద 200 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

* నూతన విద్యా విధానానికి మద్దతు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (NEP- 2020) గురించి అవగాహన కల్పించడమే లక్ష్యమని విద్యాభారతి ప్రకటించింది. భారతదేశ కేంద్రీకృత విద్యా విధానం గురించి పేర్కొంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇంపార్టెన్స్, నైపుణ్యాలతో కూడిన విద్య గురించి వివరిస్తామని స్పష్టం చేసింది.

ఆరో తరగతి నుంచి మాతృభాషలో విద్యా బోధన కొనసాగిస్తూ, మాతృభాష ఆవశ్యకతను వివరించనుంది. సెప్టెంబర్ 11 నుంచి జాతీయ విద్యా విధానంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు విద్యాభారతి జనరల్ సెక్రటరీ శ్రీరామ్ అరోకర్. నూతన జాతీయ విద్యా విధానం అమలులో కేంద్ర ప్రభుత్వానికి సహాయం అందించడమే లక్ష్యమని శ్రీరామ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : SSC CGL ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి.. కన్నడ భాషా సంఘాల ఆందోళన..

* సంస్కరణలకు ప్రోత్సాహం

నూతన విద్యా విధానం (NEP)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలకు ప్రోత్సహం లభించే విధంగా విద్యాభారతి ఆధ్వర్యంలో ప్రచారం చేయనున్నారు. సంస్కరణల పరిధి, స్థాయి, వాటి ప్రభావం గురించి చర్చలు దేశవ్యాప్తంగా జరిగేలా చూస్తారు.

నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా MyNEP, NEP పోటీలను నిర్వహించనున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేయనున్న కొత్త యూనివర్సిటీలు ఏయే ప్రాంతాల్లో ఉంటాయనే విషయంపై ఇప్పటికి స్పష్టత రాలేదు. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం కవర్ అయ్యేలా ఈ ఐదు యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Karnataka, RSS

ఉత్తమ కథలు