మెడికల్ విభాగంలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి గుడ్ న్యూస్. రాజస్థాన్ సబార్డినేట్ అండ్ మినిస్టీరియల్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (RSMSSB) రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 8 నుంచి అధికారిక వెబ్సైట్ rsmssb.rajasthan.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 7న ముగియనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా RSMSSB మొత్తం 3,531 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. పరీక్షను 2023 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.
అర్హత ప్రమాణాలు
- దరఖాస్తుచేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
- రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉంది.
- అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీలో కమ్యూనిటీ హెల్త్ లేదా నర్సింగ్ (జీఎన్ఎం/బీఎస్సీ) లేదా ఆయుర్వేద ప్రాక్టీషనర్(BAMS) కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
- రాజస్థాన్ నర్సింగ్ కౌన్సిల్/బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, రాజస్థాన్‌లో అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి.
అప్లికేషన్ ప్రాసెస్
అభ్యర్థులు ముందు అధికారిక వెబ్సైట్ rssmb.rajasthan.gov.in ఓపెన్ చేసి, రిక్రూట్మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ సీహెచ్ఓ పోస్టులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. కొత్త విండోలో డిస్ప్లే అయ్యే అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. చివరకు అప్లికేషన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు
అన్రిజర్వ్డ్/బీసీ/ఈబీసీ (క్రిమి లేయర్) కేటగిరీ అభ్యర్థులు రూ.450 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీసీ/ఈబీసీ (నాన్ క్రిమి లేయర్), ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులు రూ. 350 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.250 ఫీజుగా చెల్లించాలి.
పరీక్ష వివరాలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పరీక్షలో మొత్తంగా 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించనున్నారు. పరీక్ష గంటన్నర పాటు కొనసాగనుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్నేషన్ కూడా ఉండనుంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 జీతం లభించనుంది.
రాజస్థాన్ సబార్డినేట్ అండ్ మినిస్టీరియల్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (RSMSSB) వివిధ శాఖల్లోని విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు , ఫారెస్ట్ విభాగంలో ఫారెస్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎక్సైజ్ విభాగంలో జమేదార్ గ్రేడ్ II పోస్టులను భర్తీ చేస్తుంది. అలాగే సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్ లో క్లర్క్ గ్రేడ్ II పోస్టులు, ఆఫీస్ క్లరికల్ సర్వీస్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, JOBS, Rajasthan, State Government Jobs