హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Group D: ఆర్​ఆర్​బీ గ్రూప్​ డి అభ్యర్థులకు గుడ్​న్యూస్​..​ మరో అవకాశం ఇచ్చిన బోర్డు..

RRB Group D: ఆర్​ఆర్​బీ గ్రూప్​ డి అభ్యర్థులకు గుడ్​న్యూస్​..​ మరో అవకాశం ఇచ్చిన బోర్డు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RRB Group D: RRB గ్రూప్ D పరీక్షల రిజిస్ట్రేషన్ మార్చి 12, 2019న ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియకు ఏప్రిల్ 12, 2019 వరకు గడువు ఇచ్చారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశంలోని 16 రైల్వే జోన్‌లలోని 1,03,769 గ్రూప్ D పోస్టులను ఆర్‌ఆర్‌బీ భర్తీ చేయనుంది.

ఇంకా చదవండి ...

రైల్వే గ్రూప్​డీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. కరోనా కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న గ్రూప్​ డీ పరీక్షకు సంబంధించి తాజాగా రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. రెండేళ్ల క్రితమే దరఖాస్తు ప్రక్రియ పూర్తయినప్పటికీ.. దరఖాస్తు చేసే సమయంలో కొంత మంది అభ్యర్థులు చేసిన చిన్న చిన్న తప్పుల కారణంగా వారి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. కొంత మంది అభ్యర్థులు తమ పాస్​పోర్ట్​ ఫోటోను సరిగ్గా అప్​లోడ్​ చేయకపోవడం వల్ల లేదా సంతకం సరిగా లేనందున రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు వారి అప్లికేషన్లను రిజెక్ట్ చేసింది. అలాంటి వారు తమ వివరాలను సరిచేసుకునేందుకు ఆర్​ఆర్​బీ గతంలోనే ఎడిట్​ ఆప్షన్​ను​ అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ, ఇంకా చాలా మంది ఎడిట్​ చేసుకోవాల్సి ఉందని ఆర్​ఆర్​బీ గుర్తించింది.

అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో వారికి మరో అవకాశం కల్పిస్తూ ఆర్​ఆర్‌బీ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్​ను ఆర్​ఆర్​బీ వెబ్​సైట్ www.rrbald.gov.in ​లో ఉంచింది. త్వరలోనే ఎడిట్​ లింక్​ను యాక్టివేట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఎడిట్​ చేసుకునే అభ్యర్థులు తమ స్కాన్డ్​ ఫోటోగ్రాఫ్, సంతకాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్​బీఐ సూచించింది.

‘‘చెల్లని ఫోటోగ్రాఫ్/లేదా సంతకం కారణంగా కొంత మంది అభ్యర్థుల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. అటువంటి అభ్యర్థులు మరోసారి ఎడిట్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. ఫోటోగ్రాఫ్​/లేదా సంతకాన్ని మళ్లీ అప్‌లోడ్ చేయడానికి ఎడిట్​ లింక్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం." అని అధికారిక నోటిఫికేషన్​లో పేర్కొంది.

* త్వరలోనే ఎడిట్​ లింక్​​ యాక్టివేట్​..

ఇప్పటికే దరఖాస్తు ఆమోదం పొందిన అభ్యర్థులు ఎడిట్​ లింక్ ద్వారా మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఫోటో లేదా సంతకాన్ని తప్పుగా అప్​లోడ్​ చేసిన వారు మాత్రమే ఈ లింక్​ ద్వారా వివరాలు సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులకు అందిస్తున్న ఆఖరి అవకాశమని, ఆ తర్వాత ఎటువంటి విజ్ఞప్తులను బోర్డు పరిగణలోకి తీసుకోమని ఆర్​ఆర్​బీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి : ఇంట‌ర్న్‌షిప్‌తో కొలువుకు మార్గం సుల‌భం.. అందుబాటులో ప‌లు కోర్సులు

RRB గ్రూప్ D పరీక్షల రిజిస్ట్రేషన్ మార్చి 12, 2019న ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియకు ఏప్రిల్ 12, 2019 వరకు గడువు ఇచ్చారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశంలోని 16 రైల్వే జోన్‌లలోని 1,03,769 గ్రూప్ D పోస్టులను ఆర్‌ఆర్‌బీ భర్తీ చేయనుంది. దరఖాస్తు తిరస్కరణకు గురైన అభ్యర్థులు మాడిఫికేషన్ లింక్‌కు సంబంధించిన నోటీసును తనిఖీ చేయడానికి rrbcdg.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Exams, Railway jobs, RRB

ఉత్తమ కథలు