RRB Jobs: రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్?

Railway Notifications | తన డ్యూటీ స్టేషన్ పరిధిలో నడిచే రైళ్లకు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తారు. సిగ్నల్స్ ఆపరేట్ చేయడం, అన్ని పనులు నిబంధనల ప్రకారం సాగుతున్నాయో లేదో చూసుకోవడం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ విధి.

news18-telugu
Updated: June 29, 2019, 8:36 AM IST
RRB Jobs: రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్?
RRB Jobs: రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? (ప్రతీకాత్మక చిత్రం, image: Getty Images)
  • Share this:
నిరుద్యోగులకు రైల్వే వరాల జల్లు కురిపిస్తోంది. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కొంతకాలం క్రితం లక్షన్నరకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది రైల్వే. అంతేకాదు... రెండేళ్లలో మరో లక్ష మంది ఉద్యోగులు రైల్వే నుంచి రిటైరౌతారని అంచనా. ఈ లెక్కన రైల్వే నుంచి మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జారీ చేసిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ-NTPC నోటిఫికేషన్‌లోనే 35 వేలకు పైగా పోస్టులున్నాయి. త్వరలో హాల్ టికెట్లు కూడా రిలీజ్ చేయనుంది ఆర్‌ఆర్‌బీ. ఎన్‌టీపీసీ కేటగిరీలో స్టేషన్ మాస్టర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్ లాంటి పోస్టులున్నాయి. మరి ఈ పోస్టుల్లో ఏ పోస్ట్ ఎంచుకుంటే మంచిది? ఏ పోస్టుకు జీతం ఎంత? చేయాల్సిన విధులేంటీ? ఏ పోస్ట్ ఎంపిక చేసుకుంటే మంచిది? తెలుసుకోండి. వేర్వేరు పోస్టులకు అర్హతలు, వేతనాల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

Railway Jobs, RRB NTPC 2019, RRB Senior Clerk cum Typist Salary, Junior Account Assistant cum Typist Salary, Station Master Salary, Accounts Clerk cum Typist Salary, Trains Clerk Salary, railway job salary details, రైల్వే ఉద్యోగాలు, రైల్వే జాబ్స్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్, రైల్వే ఉద్యోగాలు జీతాలు
image: RRB


స్టేషన్ మాస్టర్: తన డ్యూటీ స్టేషన్ పరిధిలో నడిచే రైళ్లకు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తారు. సిగ్నల్స్ ఆపరేట్ చేయడం, అన్ని పనులు నిబంధనల ప్రకారం సాగుతున్నాయో లేదో చూసుకోవడం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ విధి. డిగ్రీ పాసైన వాళ్లు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

గూడ్స్ గార్డ్: గూడ్స్ రైళ్లను మేనేజ్ చేయాల్సిన బాధ్యత గూడ్స్ గార్డుది. డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేయొచ్చు. ప్రిలిమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ అప్రెంటీస్: కమర్షియల్ అప్రెంటీస్ ఉద్యోగుల్నే మల్టీ టాస్కింగ్ సూపర్‌వైజర్స్ అంటారు. రెండేళ్లు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత చీఫ్ పార్శిల్, కమర్షియల్, గూడ్స్ క్లర్క్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్స్ పోస్టులకు ఎంపిక చేస్తారు. డిగ్రీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

Read this: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

Railway Jobs, RRB NTPC 2019, RRB Senior Clerk cum Typist Salary, Junior Account Assistant cum Typist Salary, Station Master Salary, Accounts Clerk cum Typist Salary, Trains Clerk Salary, railway job salary details, రైల్వే ఉద్యోగాలు, రైల్వే జాబ్స్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్, రైల్వే ఉద్యోగాలు జీతాలు
ప్రతీకాత్మక చిత్రం
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఆఫీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. డిగ్రీ పాసైనవాళ్లను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ట్రాఫిక్ అప్రెంటీస్: ట్రాఫిక్ అప్రెంటీస్‌ను ఆపరేషన్స్ బ్రాంచ్‌లో మల్టీ టాస్క్‌డ్ సూపర్‌వైజర్‌గా నియమిస్తారు. రెండేళ్లు గార్డ్, స్టేషన్ మాస్టర్, సెక్షన్ కంట్రోలర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

సీనియర్ టైమ్ కీపర్: రైళ్ల రాకపోకల సమయాన్ని రికార్డ్ చేసి పెట్టడం సీనియర్ టైమ్ కీపర్ విధి. డిగ్రీ పాసైన వాళ్లను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్: ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ రిజర్వ్‌డ్ టికెట్స్ జారీ చేయడం ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ డ్యూటీ. కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇవే కాక రైల్వేలో వేర్వేరు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. అర్హతల్ని బట్టి ఉద్యోగాలను ఎంపిక చేసుకోవచ్చు.

Read this: RPF Jobs: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్

Railway Jobs, RRB NTPC 2019, RRB Senior Clerk cum Typist Salary, Junior Account Assistant cum Typist Salary, Station Master Salary, Accounts Clerk cum Typist Salary, Trains Clerk Salary, railway job salary details, రైల్వే ఉద్యోగాలు, రైల్వే జాబ్స్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్, రైల్వే ఉద్యోగాలు జీతాలు
ప్రతీకాత్మక చిత్రం


ట్రాఫిక్ అసిస్టెంట్: సీనియర్లకు అసిస్టెంట్‌గా ఉంటారు. సిగ్నల్ లేదా ట్రాఫిక్ ఇంఛార్జ్‌గా శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: భారతీయ రైల్వేలో ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పనిచేయాల్సి ఉంటుంది. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ నేతృత్వంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టింగ్ లభిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

HCL Jobs: హెచ్‌సీఎల్‌లో 3000 ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

Jobs: ఆ రంగంలో కొత్తగా 1,49,000 ఉద్యోగాలు

Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం
Published by: Santhosh Kumar S
First published: June 29, 2019, 8:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading