RRB Update: రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? భాష మార్చుకోవడానికి రేపటి వరకే గడువు

RRB JE 2019 | పరీక్షకు దరఖాస్తు చేసిన సమయంలో పొరపాటుగా ఇతర భాష ఎంచుకున్నా లేదా ఎంచుకున్న భాష మార్చుకోవాలన్నా మే 1 లోగా మార్పులు చేసుకోవచ్చు. భాషను మార్చుకోని వారికి దరఖాస్తు సమయంలో ఎంచుకున్న భాషలోనే ప్రశ్నాపత్రం వస్తుంది.

news18-telugu
Updated: April 30, 2019, 10:51 AM IST
RRB Update: రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? భాష మార్చుకోవడానికి రేపటి వరకే గడువు
RRB Update: రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? భాష మార్చుకోవడానికి రేపటి వరకే గడువు
news18-telugu
Updated: April 30, 2019, 10:51 AM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకు దరఖాస్తు చేశారా? పరీక్ష రాసే భాష మార్చుకునే అవకాశం కల్పిస్తోంది ఆర్ఆర్‌బీ. రైల్వే జూనియర్ ఇంజినీర్(JE) పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారికి మే 1 వరకు గడువు ఇచ్చింది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్లలో విండో ఓపెన్ చేసింది. మార్పులకు ఒకసారి మాత్రమే అనుమతి ఉంటుంది. పరీక్షకు దరఖాస్తు చేసిన సమయంలో పొరపాటుగా ఇతర భాష ఎంచుకున్నా లేదా ఎంచుకున్న భాష మార్చుకోవాలన్నా మే 1 లోగా మార్పులు చేసుకోవచ్చు. భాషను మార్చుకోని వారికి దరఖాస్తు సమయంలో ఎంచుకున్న భాషలోనే ప్రశ్నాపత్రం వస్తుంది. మరి పరీక్ష రాసే భాషను ఆన్‌లైన్‌లో ఎలా మార్చుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి.

RRB JE 2019: పరీక్ష రాసే భాషను మార్చుకోండి ఇలా...


ముందుగా rrbsecunderabad.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

పరీక్ష రాసే భాషను మార్చుకునేందుకు CEN 03/2018 నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి.
RRB JE 2019 పరీక్షకు సంబంధించిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ లాగిన్ RRB 2019 రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.


లాగిన్ చేసిన తర్వాత పరీక్ష రాసే భాషను మార్చుకోవచ్చు.
Loading...
ఆర్ఆర్‌బీ జేఈ 2019 పరీక్ష తెలుగు, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తుంది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్. ఇంగ్లీష్ డిఫాల్ట్ లాంగ్వేజ్‌గా ఉంటుంది. ఇంగ్లీష్ కాకుండా ఏ భాష ఎంచుకుంటే ఆ భాషలో ప్రశ్నాపత్రం వస్తుంది.

Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...

ఇవి కూడా చదవండి:

RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా

PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...